Abn logo
Aug 10 2020 @ 19:43PM

బిగ్‌బాస్-14: సల్మాన్‌కు రూ.16 కోట్లు?

హిందీ టెలివిజన్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా నిలిచింది `బిగ్‌బాస్`. ఇప్పటికే ప్రసారమైన 13 సీజన్లకు ప్రేక్షకుల నుంచి అమిత ఆదరణ లభించింది. త్వరలోనే 14వ సీజన్ ప్రారంభం కాబోతోందట. `బిగ్‌బాస్-14` ప్రోమో షూటింగ్ కోసం సల్మాన్ సిద్ధమవుతున్నారట. 


వచ్చే నెల 27 నుంచి ఈ కార్యక్రమం ప్ర‌సారం కాబోతోందట. కంటెస్టెంట్లు అందరికీ ముందే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హౌస్ లోప‌లికి పంపనున్నారట. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు సల్మాన్‌ ఏకంగా 16 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నాడట. సల్మాన్ క్షేమం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 

Advertisement
Advertisement
Advertisement