Abn logo
Jul 8 2020 @ 20:57PM

బిగ్‌బాస్ కోసం స‌ల్మాన్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌!!

హాలీవుడ్ పాపుల‌ర్ అయిన బిగ్ బ్ర‌ద‌ర్ రియాలిటీ షో మ‌న దేశంలో బాలీవుడ్‌కు బిగ్‌బాస్‌గా దిగుమ‌తి అయ్యింది. ఇప్పుడే ద‌క్షిణాదిన కూడా పాపులారిటీ సంపాదించుకుంటోంది. బిగ్‌బాస్ షోకు ఇండియాలో పాపులారిటీని సంపాదించి పెట్టింది మాత్రం కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌. ఒకట్రెండు షోలు మిన‌హా మిగ‌తా షోస్‌కు స‌ల్మానే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. బిగ్‌బాస్‌పై అంద‌రి దృష్టి పెట్ట‌డానికి స‌ల్మాన్ హోస్టింగ్ కూడా కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో నిర్వాహ‌కులు తాజా బిగ్‌బాస్ షో కోసం స‌ల్మాన్‌కు భారీ మొత్తాన్ని రెమ్యున‌రేష‌న్‌గా ఇస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఒక్కొక్క హోస్టింగ్ ఎపిసోడ్‌కి రూ.16 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్ల‌ను స‌ల్మాన్‌ఖాన్‌ను బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఇస్తున్నార‌ని టాక్‌. ఈ రెమ్యున‌రేష‌న్ వింటుంటూనే షాక్ కావాల్సి వ‌స్తుంది. మ‌రి ఇందులో నిజా నిజాలేంటో నిర్వాహ‌కులే చెప్పాలి. 

Advertisement
Advertisement
Advertisement