సెలూన్‌ ముసుగులో వ్యభిచారం

ABN , First Publish Date - 2021-01-16T05:48:12+05:30 IST

బయట నుంచి చూసే వారికి అదో సెలూన్‌. అక్కడ హెయిర్‌ కటింగ్‌, షేవింగ్‌, ఫేస్‌ ప్యాక్‌ వంటివి చేస్తుంటారని అందరూ భావిస్తారు.

సెలూన్‌ ముసుగులో వ్యభిచారం

పోలీసుల రైడ్‌తో వెలుగులోకి..


నెల్లూరు(క్రైం), జనవరి 15: బయట నుంచి చూసే వారికి అదో సెలూన్‌. అక్కడ హెయిర్‌ కటింగ్‌, షేవింగ్‌, ఫేస్‌ ప్యాక్‌ వంటివి చేస్తుంటారని అందరూ భావిస్తారు. అయితే అందులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం కూడా నిర్వహిస్తున్నారు.  పోలీసుల సమాచారం మేరకు... నెల్లూరులోని అరవింద నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏరియాకు చెందిన సుధాకర్‌ రాజు క్రాంతి స్కూల్‌ సమీపంలో ప్లాటినం సెలూన్‌ అండ్‌ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్నాడు. అక్కడ సెలూన్‌ పేరుతో మసాజ్‌, వ్యభిచార కేంద్రం కూడా నిర్వహిస్తున్నాడు. కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాల నుంచి అందమైన యువతలను తీసుకువచ్చి ఈ చీకటి వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న దర్గామిట్ట స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ సిబ్బందితో కలిసి గురువారం సెలూన్‌పై దాడి చేశారు. ఓ సెక్స్‌వర్కర్‌తోపాటు ఒక విటుడు, సెలూన్‌లో పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సెక్స్‌వర్కర్‌ను హోమ్‌కు తరలించగా మిగిలిన వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని సీఐ తెలిపారు. 

Updated Date - 2021-01-16T05:48:12+05:30 IST