Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీ ధైర్యానికి సెల్యూట్‌

ఒసాకాకు జొకోవిచ్‌, హామిల్టన్‌, మిచెల్‌ మద్దతు 


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకాకు వరల్డ్‌ నంబర్‌ వన్‌ జొకోవిచ్‌ సెల్యూట్‌ చేశాడు. ఆమె నిర్ణయం ఎంతో సాహసోపేతమైందన్నాడు. ఎఫ్‌-1 వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కూడా ఒసాకకు అండగా నిలిచాడు. ‘నవోమికి నా మద్దతు ఉంటుంది. ఆమె సాహసోపేత నిర్ణయం తీసుకొంద’ని జొకో చెప్పాడు. ఒసాకా వేగంగా కోలుకొని మరింత బలంగా తిరిగొస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ఒసాకా ఒంటరి కాదని.. ఎంతో మంది తన వెంట ఉన్నారన్న విశ్వాసం ఆమెలో కలిగించాలని తన ఫాలోవర్లను కోరుతూ హామిల్టన్‌ ట్వీట్‌ చేశాడు.


మానసిక అనారోగ్యమనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నాడు. నవోమి నిర్ణయాన్ని అమెరికా మహిళా గోల్ఫర్‌ మిచెల్‌ వి కూడా సమర్థించింది. ‘తమ ప్రదర్శన సరిగా లేని రోజు మీడియాను ఎదుర్కోవడం ఎంత కష్టమో ఆటగాళ్లందరికీ అనుభవమే. ఆటకంటే మించిన జీవితం ఎంతో ఉంద’ని మిచెల్‌ చెప్పింది.

Advertisement
Advertisement