ఒంగోలు మంచినీటి పథకానికి మోక్షం

ABN , First Publish Date - 2020-09-27T17:53:42+05:30 IST

ఒంగోలు కార్పొరేషన్‌లో ప్రజలకు రోజువారీ మంచినీరు అందించేందుకు ఉద్దేశించి..

ఒంగోలు మంచినీటి పథకానికి మోక్షం

రూ. 70 కోట్లు ఇచ్చేందుకు సీఎం హామీ

మంత్రి బాలినేని పట్టుబట్టడంతో అనుమతి


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ఒంగోలు కార్పొరేషన్‌లో ప్రజలకు రోజువారీ మంచినీరు అందించేందుకు ఉద్దేశించి అర్ధంతరంగా నిలిచిపోయిన  పథక పనుల పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. అందుకు అవసరమైన నిధుల విడుదలకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టడంతో ఆయన సమ్మతించారు.  ఆ వెంటనే పనులు పునఃప్రారంభించాలన్న మౌఖిక ఆదేశాలు సదరు కాంట్రాక్టర్‌కు అందినట్లు తెలిసింది.

 

గత ప్రభుత్వ హయాంలో మంజూరు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర భాగస్వామ్యంతో అమృత పథకం కింద ఒంగోలుకు మంచినీటి స్కీం మంజూరైంది. గుండ్లకమ్మ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నగ రానికి నీటిని మళ్లించి రోజూ సరఫరా చేయాలన్నది పథకం ఉద్దేశం. సుమారు రూ. 123 కోట్ల అంచనా వ్యయం తో పథకాన్ని చేపట్టారు. అందులో సగం ఒంగోలు కార్పొరేషన్‌ భ రించాల్సి ఉంది. మిగిలిన దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా ఇచ్చేందుకు అంగీకరించాయి. ఆరంభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలి విడత నిధులు విడుదల చేశాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించేందుకుపనులు కూడా చేపట్టారు. అవి కొంతమేర పూర్తయ్యాయి. నీటి సరఫరా అవకాశం లేని కొన్ని ప్రాంతాలకు కొత్తగా పైపులైన్లు ఏర్పాటుతోపాటు, ఎక్కడికక్కడే అవసరమైన ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు కూడా నిర్మించాల్సి ఉంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులతో పనులు వేగంగా జరిగిన దశలో ఒంగోలు కార్పొరేషన్‌లో నిధుల సమస్య  ఏర్పడింది. దీంతో కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే నిలిపివేశారు. 


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి అయిన బాలినేని ఈ విషయంపై దృష్టి సారించారు.  కార్పొరేషన్‌ నుంచి నిధులు కేటాయించే పరిస్థితి లేదన్న విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ప్ర యత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు లేవని ప్రజలు భావించారు. ఈనేపథ్యంలో శుక్రవారం సీఎం జగన్‌ను మంత్రి బాలినేని కలిశారు. నగర ప్రజలకు రోజువారీ మంచినీళ్లు ఇస్తానని తాను హామీ ఇచ్చానని, ఆగిపోయిన పథకం పునరుద్ధరణకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. తొలు త కార్పొరేషన్‌ నుం చే నిధులు సమకూర్చుకోవాలని చెప్పిన సీఎం ఆతర్వాత బాలినేని  పట్టుబట్టడంతో నిధుల విడుదలకు అంగీకరించారు. అప్పటికప్పుడే సీఎం తన పేషీలోని అధికారుల ద్వారా సమాచారం తెలుసుకొని ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటల అనంతరం కాంట్రాక్టర్‌కు కూడా ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చినట్లు తెలిసింది.


పనులు పునఃప్రారంభించండి..

పెండింగ్‌ బిల్లులు ఇవ్వడమేగాకుండా కార్పొరేషన్‌ వాటా నిధు లను రాష్ట్రప్రభుత్వం ఇవ్వబోతున్నందున సమస్య ఉండదని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై మంత్రి బాలినేని ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమపద్ధతిలో పరిష్కరించే దిశగా తాము వేస్తున్న అడుగుల్లో ఇదో ముఖ్యమైన ముందు అడుగని అన్నారు. కార్పొరేషన్‌లో నిధుల లేమి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఆ పథకం పూర్తవుతుందని, తన ప్రతిపాదనలకు అర్థం చేసుకుని నిధులు విడుదలకు సీఎం ఆమోదించడం ఒంగోలు ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. రోజువారీ నీరు ఇస్తానన్న హామీ నెరవేరుస్తానని చెప్పారు. ఇప్పటికే పోతురాజుకాలువ అభివృద్ధికి నిధులు మంజూ రు చేయించడం, ప్రజలకు ఇబ్బందిగా మారిన హైటెన్షన్‌ విద్యుత్‌లైన్‌ను తొలగించి అండర్‌గ్రౌండు లైన్‌ వేయించే పనులను ప్రారంభించడాన్ని ఆ యన ఉదహరించారు. హామీ ల అమలులో వెనకడుగు వేసేదిలేదని చెప్పారు. 

Updated Date - 2020-09-27T17:53:42+05:30 IST