ప్ర‌వాసీయుల బ్యాంక్‌‌ అకౌంట్ల ఫ్రీజింగ్‌పై ఎస్ఎఏంఎ స్ప‌ష్ట‌త‌

ABN , First Publish Date - 2020-07-08T15:58:05+05:30 IST

త‌మ వేత‌నాల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే ప్ర‌వాసీయుల బ్యాంకు ఖ‌తాల‌ను ఫ్రీజ్ చేయ‌బోతున్న‌ట్లు మంగ‌ళ‌వారం సౌదీ అరేబియాలోని కొన్ని మీడియా చాన‌ళ్లు, సోష‌ల్ మీడియా సైట్స్‌లో ఒక న్యూస్‌ బాగా హల్‌చ‌ల్ చేసింది.

ప్ర‌వాసీయుల బ్యాంక్‌‌ అకౌంట్ల ఫ్రీజింగ్‌పై ఎస్ఎఏంఎ స్ప‌ష్ట‌త‌

రియాద్‌: త‌మ వేత‌నాల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే ప్ర‌వాసీయుల బ్యాంకు ఖ‌తాల‌ను ఫ్రీజ్ చేయ‌బోతున్న‌ట్లు మంగ‌ళ‌వారం సౌదీ అరేబియాలోని కొన్ని మీడియా చాన‌ళ్లు, సోష‌ల్ మీడియా సైట్స్‌లో ఒక న్యూస్‌ బాగా హల్‌చ‌ల్ చేసింది. దీనిపై సౌదీ అరేబియ‌న్ మానెట‌రీ అథారిటీ(ఎస్ఎఏంఎ) తాజాగా స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఈ వార్త‌లో ఎలాంటి నిజం లేద‌ని తెలిపింది. ఇలాంటి పుకార్లతో ప్ర‌వాసులు ఆందోళ‌న‌కు గురి కావొద్ద‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుత బ్యాంకు నిబంధ‌న‌లు, విధానాల‌కు లోబ‌డే ఖ‌తాల నిర్వ‌హ‌ణ ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో ప్ర‌వాసీయుల‌కు ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదు అని ఎస్ఎఏంఎ వివ‌రించింది. ఈ మేర‌కు ఒక ట్వీట్ చేసింది. కాగా, సౌదీలో ప్ర‌స్తుతం 10.5 మిలియ‌న్ల మంది ప్ర‌వాసులు ఉన్న‌ట్లు స‌మాచారం. ‌  

Updated Date - 2020-07-08T15:58:05+05:30 IST