Advertisement
Advertisement
Abn logo
Advertisement

సామాజిక సేవలో రోటరీకి ప్రత్యేకస్థానం

 విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌

విజయవాడ రూరల్‌, నవంబరు 27 : సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్‌కు ఒక ప్రత్యేకస్థానం ఉందని విద్యాశాఖ ముఖ్య కార్య దర్శి బుడితి రాజశేఖర్‌ చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, పేద ప్రజలున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రోటరీక్లబ్‌ ఎపుడూ అగ్రస్థానంలోనే ఉంటుందన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్‌ మండలం నున్న, పాతపాడు, పీ నైనవరం గ్రామాలకు రోటరీ ఫౌండేషన్‌ (ఆర్‌టీఎఫ్‌) గ్రాంట్‌ ప్రాజెక్టు కింద రూ.25 లక్షల విలువైన ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్‌, తడి, పొడి చెత్త బుట్టలను బుడితి రాజశేఖర్‌ ఆయా పంచాయతీలకు శనివారం అంద జేశారు. ఈ సందర్భంగా నున్నలో క్లబ్‌ అధ్యక్షుడు కేఎన్‌ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌ టీఎఫ్‌ గ్రాం ట్‌ ప్రాజెక్టు గురించి ఆ ప్రాజెక్టు ఇన్‌ చార్జి, కరిణి చంటిరాజు వివరించారు. అనంతరం రాజశేఖర్‌ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పారిశుధ్య కార్యక్రమం ఎంతో ముఖ్యమైందన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాశాఖ డైరెక్టర్‌  శివశంకరరావు, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ కార్యదర్శి వీ సుబ్బారావు నాయుడు, విజయవాడ మాజీ మేయర్‌ డాక్టర్‌ జంధ్యాల శంకర్‌,  రూరల్‌ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి,  సర్పంచ్‌ కాటూరి సరళ, పాతపాడు సర్పంచ్‌ దేవగిరి సుజాత, రోటరీ క్లబ్‌ మాజీ గవర్నర్‌ మోహన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement