Abn logo
Nov 22 2020 @ 21:32PM

మాల్దీవుల్లో సమంత.. ఎలా ఉందో చూశారా?

Kaakateeya

మాల్దీవుల్లో హీరోయిన్‌ అనగానే ఇప్పుడంతా ఏం ఊహించుకుంటారో తెలియంది కాదు. ఎందుకంటే.. ఇప్పటికే కాజల్‌, రకుల్‌ వంటి వారు అక్కడ చేసిన రచ్చ ఫొటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి. హీరోయిన్‌లంతా ఇప్పుడు వెకేషన్‌కి మాల్దీవులనే ఎంచుకుంటుండటం విశేషం. కరోనాతో కొన్నాళ్లుగా బందీలైన వారంతా.. అక్కడికి వెళ్లగానే ఫ్రీ బర్డ్స్‌లా మారిపోతున్నారు. శరీరం మీద ఎంత తక్కువ బట్టలుంటే అంత ఎంజాయ్‌ చేయవచ్చు అనేలా వారి మూడ్‌ మారిపోతుంది. ఈ విషయం రకుల్‌ వంటి వారిని చూస్తే అర్థమవుతుంది.


తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేయడానికి వెళ్లింది సమంత, చైతూ జంట. అలా వెళ్లారో లేదో.. అప్పుడే ఫొటోలతో సమంత సోషల్‌ మీడియాలో హాజరు వేయించేసుకుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అక్కడ సమంత ఎలా ఉందో పై ఫొటోలో చూడవచ్చు.. మరి ముందు ముందు ఇంకెలాంటి ఫొటోలను సమంత షేర్‌ చేస్తుందో.. అనే అభిప్రాయాలు అప్పుడే సోషల్‌ మీడియాలో వ్యక్తమవుతుండటం విశేషం.



Advertisement
Advertisement