Oct 25 2021 @ 09:27AM

నయనతారకి అభినందనలు తెలిపిన సామ్

‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 ఎంట్రీకి ఎంపికైన సంగతి తెలిసిందే. వినోద్ రాజ్ పి.యస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దర్శకుడు విఘ్నేశ్ శివన్, నయనతార నిర్మించారు. ఈ సందర్భంగా అందాల నాయిక సమంత తన మైక్రో బ్లాగింగ్ పేజ్ ద్వారా ఆ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. ‘మీ ఇద్దరికీ ఘనమైన అభినందనలు. ఇది చాలా అద్భుతమైన వార్త. ‘కూళంగల్’ సినిమా టీమ్ కి కూడా నా శుభాభినందనలు. మోర్ పవర్ టు యూ’ అంటూ సామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక సమంతాతో పాటు బాలీవుడ్ క్రేజీ హీరో విక్కీ కౌశల్ సైతం ‘కూళంగల్’ సినిమా ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైనందుకు నయనతార, విఘ్నేశ్ శివన్ కి అభినందనలుు తెలిపారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ‘కూళంగల్’ మూవీని తమిళ ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. మొత్తం 14 ఇండియన్ సినిమాలు ఆస్కార్ ఎంట్రీకి ఎంపికవగా.. వాటిలో ‘కూళంగల్’ తో పాటు తమిళ ‘మండేలా’, మలయాళ ‘నాయాట్టు’, సర్దార్ ఉద్దమ్ , షేర్ని, షేర్షా, తూఫాన్  హిందీ చిత్రాలతో పాటు, మరాఠీ మూవీ ‘గోదావరి’ కూడా ఆస్కార్ కి నామినేట్ అవడం విశేషం.