Abn logo
May 17 2020 @ 11:17AM

అగ్ర నిర్మాణ సంస్థలో సమంత మూవీ

తెలుగు చిత్రసీమలో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే హీరోయిన్స్‌లో స‌మంత అక్కినేని ఒక‌రు. ‘ఓబేబీ’ చిత్రం త‌ర్వాత స‌మంత మ‌రో ఫిమేల్ ఓరియెంటె్ మూవీలో న‌టించ‌లేదు. అయితే ఓ అగ్ర నిర్మాణ సంస్థ స‌మంత‌తో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీని రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్పటికే రెండు, మూడు క‌థ‌ల‌ను సిద్ధం చేసింద‌ట స‌ద‌రు నిర్మాణ సంస్థ‌. ఈ మూడు క‌థ‌ల్లో స‌మంత‌కు ఏది న‌చ్చుతుందో దానితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం స‌మంత అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్‌. క‌రోనా ఎఫెక్ట్ తగ్గిన త‌ర్వాత స‌మంత త‌దుప‌రి చిత్రాల‌పై స‌మంత ఫోక‌స్ చేయ‌నుంది. 

Advertisement
Advertisement
Advertisement