Oct 21 2021 @ 18:29PM

సామాన్యులు అయినా సమంత అయినా ఒకటే!

నాగచైతన్యతో విడాకులు వ్యవహారంపై తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచారం చేశాయంటూ మూడు యూ ట్యూబ్‌ చానళ్లపై హీరోయిన్‌ సమంత కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే! సమంత తరఫు న్యాయవాది ప్రతివాదలకు నోటీసులు పంపించని కారణంతో ఈ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది. త్వరగతిన ఈ పిటీషన్‌ను విచారించాలని గురువారం సమంత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సమాజంలో సెలబ్రిటీగా ఉన్న సమంతను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. సామాన్యులు అయిన సెలబ్రిటీలు అయిన న్యాయస్థానం ముందు ఒక్కటే అని కూకట్‌పల్లి కోర్టు పేర్కొంది. కోర్టు సమయం చివర్లో విచారిస్తామని తెలిపింది.