Abn logo
May 8 2020 @ 21:02PM

సమంతకు అలాంటి ఆలోచనే లేదట..

కొందరు నదిలా కదులుతూ ఉంటారు. మరికొందరు సముద్రంలా ఒకేచోట ఉప్పొంగుతూ ఉంటారు. ఈ విషయంలో ఈమె రెండో రకం. సౌత్‌లో ఎంతో హ్యాపీగా ఉప్పొంగిపోతుంది. బాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా.. పొంగిపోవడం లేదు. ఆ ఆకర్షణకు ఎంతమాత్రం లొంగిపోవడం లేదు. వర్క్ ముఖ్యమే. సక్సెస్ కూడా ముఖ్యమే. కానీ మనం ఎక్కడైతే కంఫర్టబుల్‌గా ఉంటామో.. అక్కడ సెటిల్ కావడం ఇంకా ముఖ్యం. ఇలాగే ఉంటుంది కొందరు దక్షిణాది భామల ఫిలాసఫీ. చాలా మంది తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రంగాలలోని హీరోయిన్స్ బాలీవుడ్‌లో ఛాన్స్ వస్తే చాలు.. చటుక్కున వెళ్లిపోతుంటారు. కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడని సౌత్ స్టార్ హీరోయిన్లు కొందరున్నారు. అనుష్క, నయనతార అలాంటివారే. అనుష్క, నయనతారలకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లే వచ్చాయి. వాళ్లు ఎందుకనో బాలీవుడ్‌పై అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సేమ్ టు సేమ్ ఫార్ములా పాటిస్తుంది అక్కినేని కోడలు సమంత. 


తెలుగు, తమిళంలో ఈ భామకు బోలెడంత మంది అభిమానులున్నారు. అంతేకాదు ఆమె సక్సెస్‌ఫుల్ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ద్వారా ఆమె ఎవరో బాలీవుడ్ దర్శకనిర్మాతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోని సమంత నటించిన ‘యూటర్న్’ చిత్రం హిందీ ఫిల్మ్ మేకర్స్‌ని ఆకర్షించిందట. కన్నడలో విడుదలైన ‘యూటర్న్’ తెలుగులో రీమేక్ అయింది. తెలుగులో సమంత ఈ చిత్రాన్ని చేసింది. రివ్యూలు, రేటింగ్స్ బాగా వచ్చినా.. ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం అనుకున్నంతగా రాలేదు. కానీ ఈ చిత్రం చూసిన బాలీవుడ్ వారికి కథతో పాటు సమంత నటన కూడా ఎంతగానో నచ్చిందట. అందుకే ఆమెను హిందీ వెర్షన్‌లో నటించమని అడుగుతున్నారట. అసలే తెలుగులో నిరాశపరిచిన సినిమా, అలాగే బాలీవుడ్‌‌కి వెళ్లాలనే ఆశలు లేని సమంత.. బాలీవుడ్ వారి విన్నపాన్ని లైట్ తీసుకుందట. సౌత్‌లోనే సౌఖ్యంగా ఉందంటూ ఈ ఆఫర్‌ను రిజిక్ట్ చేసిందట సమంత. 

Advertisement
Advertisement
Advertisement