సమంత విడాకుల ‘భరణం’ ఎంత..!?

ABN , First Publish Date - 2021-10-03T14:54:29+05:30 IST

చై–సామ్‌ తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌స్టాఫ్‌ పెట్టబోతున్నారని కొద్దిరోజులుగా..

సమంత విడాకుల ‘భరణం’ ఎంత..!?

చై–సామ్‌ తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌స్టాఫ్‌ పెట్టబోతున్నారని కొద్దిరోజులుగా నడుస్తున్న హాట్‌ టాపిక్‌‌‌కు శనివారం నాడు ఫుల్‌స్టాప్ పడిన విషయం విదితమే. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య–సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసేశారు. అలాగే సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్‌ చేశారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరువురు వెల్లడించారు. అయితే.. చక్కని జంట నాగచైతన్య, సమంత ప్రేమలో పడతారని ఎవరూ ఊహించలేదు.. అంతేకాదు.. ప్రేమలో పడ్డాక పెళ్లి పీటలు ఎక్కుతారని.. ఆ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటవుతుందని కూడా ఎవరూ అనుకోలేదు!.. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు జనాలు గ్రహించలేదు గానీ.. విడిపోతారన్న విషయాన్ని మాత్రం ముందుగానే పసిగట్టారు!. ఆ ఊహాగానాలే నిజమయ్యాయి. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే.. వీరి ప్రేమ-పెళ్లి మజిలీ ఎందుకిలా ముగిసింది.. అసలేం జరిగింది..? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న!.


200 కోట్లా..!?

అయితే.. నాగచైతన్య, సమంత విడాకులతో పాటు ‘భరణం ఎంత?’ అనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి కుటుంబాల నుంచి చైతన్యకు వారసత్వంగా ఆస్తి వచ్చింది. ఒక్కో సినిమాకూ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమంతకు 100 నుంచి 200 కోట్ల రూపాయలు భరణంగా వస్తుందనేది వెబ్‌ మీడియా సారాంశం.


అక్కినేని ఫ్యామిలీ భరణాన్ని ఇవ్వడానికి సిద్ధమైనా.. సమంత మాత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. బంధం నుంచి ప్రేమ కోరుకున్న సామ్.. ఆ బంధమే తెగిన తర్వాత ఇక భరణమే తనకు ఎందుకుని ఆమె అనుకున్నట్లు ప్రముఖ వెబ్‌సైట్లు రాసుకొస్తున్నాయి. కాగా.. ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావు, అర్భాజ్‌ ఖాన్‌ - మలైకా అరోరా, పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌.. ఇలా సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరు విడాకులు తీసుకున్నా ఇప్పటివరకూ భరణం విషయం బయటకు రాలేదు. చైతన్య, సమంత  కూడా బయటకు చెప్పకపోవచ్చు.

Updated Date - 2021-10-03T14:54:29+05:30 IST