Abn logo
Sep 19 2020 @ 12:24PM

సమంత సర్‌ప్రైజ్.. మంచు లక్ష్మి ఫిదా!

Kaakateeya

వ్యాఖ్యాత, నటి, నిర్మాత మంచు లక్ష్మి టాలీవుడ్‌లోని ఇతర సెలబ్రిటీలతో చాలా స్నేహంగా ఉంటుంది. ముఖ్యంగా సమంత, ఉపాసన, శిల్పా రెడ్డి, రకుల్ మొదలైన వాళ్లతో మంచు లక్ష్మి తరచుగా టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. ఇటీవల మంచు లక్ష్మికి సమంత స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిందట. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచు లక్ష్మి తెలియజేసింది. 


కొన్ని రోజుల క్రితం సమంత, శిల్పారెడ్డితో దిగిన ఫొటోను మంచు లక్ష్మి షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితం వీరితో పాటు లక్ష్మి, ఆమె కూతురు భోజనం చేసారట. `కొన్ని రోజుల క్రితం లంచ్ ప్లాన్‌తో సమంత, శిల్పారెడ్డి నన్ను సర్‌ప్రైజ్ చేశారు. అలాంటివాటిని మిస్ అవుతున్నా. మనం తరచుగా ఇలాంటి లంచ్‌లకు వెళ్లాల`ని మంచు లక్ష్మి కామెంట్ చేసింది. అలాగే తన రిఫ్రిజిరేటర్‌ను చిన్న చిన్న మొక్కలతో సమంత అద్భుతంగా డెకరేట్ చేసిందని మంచు లక్ష్మి పేర్కొంది.



Advertisement
Advertisement
Advertisement