Sep 18 2021 @ 08:27AM

తిరుమల వెంకన్న, శ్రీ కాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సమంత

ప్రముఖ హీరోయిన్ సమంత తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం  తిరుమలకు చేరుకున్న సమంత, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్న ఆమె, తర్వాత స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం తరపున వేద పండితులు మంత్రోఛ్చరణలతో ఆశీర్వదించి తీర్థ - ప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు. అయితే సమంత ఒక్కరే దైవ దర్శనానికి వెళ్ళడం ఇక్కడ ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవాలి. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం', తమిళంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తోంది. అలాగే ప్రముఖ ఓటీటీ నిర్మించనున్న వెబ్ సిరీస్‌కు ఇటీవల సైన్ చేసినట్టు సమాచారం.