Abn logo
Aug 10 2020 @ 17:30PM

మిహికాకు స‌మంత స్వాగ‌తం: స‌మంత‌

ఆదివారం రానా ద‌గ్గుబాటి, మిహికా బ‌జాజ్ ఓ ఇంటివార‌య్యారు. ద‌గ్గుబాటి కుటుంబం ఈ వేడుక‌ను ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటోంది. ద‌గ్గుబాటి వారి ఆడ‌ప‌డుచు వ‌రుస అయిన స‌మంత మిహీకా బ‌జాజ్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ‘కుటుంబంలోకి స్వాగ‌తం మిహికా’ అని  ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి దిగిన ఫొటోను కూడా స‌మంత సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతుంది. పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement