Abn logo
Dec 4 2020 @ 16:36PM

సూపర్ ఫిట్ సమంత!

టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యం గురించి తెలిసిందే. వ్యాయామం, డైటింగ్ విషయంలో సమంత చాలా స్ట్రిక్టుగా ఉంటుంది. జిమ్‌లో చెమటోడ్చడంతోపాటు యోగా కూడా చేస్తుంటుంది. ఇటీవల భర్త చైతన్యతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లి వచ్చిన సమంత మళ్లీ వర్కవుట్లు ప్రారంభించింది. 


తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే సమంత తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. నిపుణుడి పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియోను సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సమంత పట్టుదల, శ్రమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement