సామర్లకోటలో 36 గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-29T05:41:07+05:30 IST

సామర్లకోట, జనవరి 28: పట్టణంలో గృహావసర గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సివిల్‌ సప్లయిస్‌ అధికారి పి.విజయభాస్కర్‌, సామర్లకోట, కరప, కాకినాడ ఎంఎ్‌సవోలు సాయిరామ్‌, సుబ్బారావు, వీఆర్వోలు నూతలపాటి లోవరాజు,

సామర్లకోటలో 36  గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం

సామర్లకోట, జనవరి 28: పట్టణంలో గృహావసర గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సివిల్‌ సప్లయిస్‌ అధికారి పి.విజయభాస్కర్‌, సామర్లకోట, కరప, కాకినాడ ఎంఎ్‌సవోలు సాయిరామ్‌, సుబ్బారావు, వీఆర్వోలు నూతలపాటి లోవరాజు, రాంజీ, గోపాలకృష్ణ శుక్రవారం దాడులు నిర్వహించారు. మొత్తం 36 సిలిండర్లను స్వాధీనం చేసుకుని స్ధానిక గ్యాస్‌ ఏజెన్సీ్‌సకు అప్పగించారు. బాధ్యులైన వారిపై  6(ఎ) కేసు నమోదు చేసి జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-29T05:41:07+05:30 IST