ఏ క్షణాన కూలుతుందో!

ABN , First Publish Date - 2021-03-02T05:47:52+05:30 IST

సామర్లకోట, మార్చి 1: సామర్లకోట పట్టణ నడిబొడ్డున ఉన్న కెమిలీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఏ క్షణాన కూలుతుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నా యి. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొంతభాగం ఇటీవల వర్షాలకు కూలీపోవడం తో తహ

ఏ క్షణాన కూలుతుందో!
సామర్లకోట రింగ్‌ సెంటర్‌ వద్ద శిథిల స్థితిలో ఉన్న భవనం

శిథిల స్థితిలో కెమిలీ భవనం

చలనం లేని యజమానులు

సామర్లకోట, మార్చి 1: సామర్లకోట పట్టణ నడిబొడ్డున ఉన్న కెమిలీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఏ క్షణాన కూలుతుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొంతభాగం ఇటీవల వర్షాలకు కూలీపోవడం తో తహశీల్దార్‌, మున్సిపల్‌ అధికారులు భవనం ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించి భవనం కిందిభాగంలో అద్దెకుంటున్న వ్యాపారులను తక్షణం ఖాళీ చేయించాల్సిందిగా యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా భవన యజమానుల్లో ఎటువంటి చలనం లేకపోయింది. రోజురోజుకూ భవనంలోని స్లాబు పెచ్చులు ఊడిపడడంతో మరింత శిథిలంగా మారుతోంది. ఏ క్షణాన్నైనా అనుకోని ఉపద్రవం జరిగితే భవనం కింది భాగంలో సుమారు 40 మంది వ్యాపారులు ఉన్నందున ప్రాణాపాయం పొంచిఉంది. ఇరువైపులా గల రోడ్డుల్లో నిత్యం వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. భారీ ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు సత్వరం శిథిల భవనం నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా పలువురు కోరుతున్నారు.


Updated Date - 2021-03-02T05:47:52+05:30 IST