Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

గన్నవరం, డిసెంబరు 7: ఉద్యోగుల సమస్య లు పరిష్కరించటంతో పాటు  ఇవ్వాల్సిన పీఆర్‌సీ, డీఏలను తక్షణమే చెల్లించాలని గన్నవరం ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ వి.సాంబశివరావు అన్నారు. ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ఎన్‌జీవో కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లా డుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. దశల వారీగా జరిగే ఆందోళనలో ఉద్యోగులందరూ పాల్గొనాలన్నారు. అలాగే అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరిం చి నిరసన తెలిపారు. జేఏసీ కన్వీనర్‌ వీవీ మోహన్‌ కృష్ణ, ఎన్‌జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పోలిమెట్ల జయరాజ్‌, నాయకులు దేవరపల్లి విద్యా సాగర్‌, మరీదు వరప్రసాద్‌, రవి, రామలింగేశ్వరరావు, రాబర్ట్‌ క్లైవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బాపులపాడులో.. 

 హనుమాన్‌జంక్షన్‌  : రెవెన్యూ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని  కోరుతై  బాపులపాడు తహసీ ల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కార సాధనకు ఈ నెల 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు  నిర్వహించాలని ఏపీ  ఉద్యోగుల జేఏసీ  ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం బాపుల పాడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది  నిరసన తెలిపారు. తహసీల్దార్‌ సిహెచ్‌.నరసింహారావు నాయకత్వంలో డీటీ బాలకిరణ్‌, ఆర్‌ఐ శ్రీనివాసు, వీర్వోలు, వీఆర్యేలు పాలొన్నారు. 

పీహెచ్‌సీ సిబ్బంది మద్దతు

ఏపీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ వారికి మద్దతుగా మంగళవారం బాపుల పాడు పీహెచ్‌సీ  వైద్య సిబ్బంది  నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నారయ్య, హెల్త్‌  అసిస్టెంట్‌  జి.నాగరాజు, సూపర్‌వైజర్‌ చంద్రశేఖర్‌, సినియర్‌ అసిస్టెంట్‌ శ్యాంసుందర్‌, ఏఎన్‌ఎంలు, స్టాప్‌ నర్స్‌లు పాల్గొన్నారు.

వీరవల్లిలో..

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : అత్యవసర విభాగ మైన వైద్యశాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేయడం, ఔట్‌ సోర్సింగ్‌, ఇతర ఒప్పంద ఉద్యోగుల జీతాల విష యంలో గందరగోళ పరిస్ధితులు నెలకొన్నందున తమ సమస్యల పరిష్కారానికి గన్నవరం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పి.సురేంద్రఆధ్వర్యంలో వీరవల్లి పీహెచ్‌సీ సిబ్బంది నిరసన తెలిపారు. వీరవల్లి పీహెచ్‌సీ ఆవరణలో మంగళవారం వైద్య సిబ్బందితో కలిసి సురేంద్ర, సీతారామయ్య నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.  ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు పరిష్కారం దిశగా కార్యాచరణ చేయకపోవడం వల్లే తాము నిరసన తెలియజేస్తున్నామని సురేంద్ర, సీతారామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో శ్రీనివాసరావు, పీహెచ్‌ఎన్‌ సౌదామణి, ఎంపీహెచ్‌ఎస్‌ శాంతకుమారి, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

నెప్పల్లిలో..

నెప్పల్లి (కంకిపాడు)  : ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎన్జీవో కంకిపాడు యూనిట్‌ నాయకులు మండవ శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నెప్పల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఐదు వాయిదాల కరువుభత్యం, పెండింగ్‌లో ఉన్న డీఏలు, వేతన సవరణ వంటి అనేక సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement