Abn logo
Sep 22 2021 @ 22:25PM

సమస్యలు పరిష్కరించకపోతే షాపులు మూసేస్తాం

తహసీల్దారు పద్మావతికి వినతిపత్రం అందజేస్తున్న డీలర్లు

కోట, సెప్టెంబరు 22 :  సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే షాపులు మూసేస్తామంటూ రేషన్‌ డీలర్లు బుధవారం తహసీల్దారు పద్మావతికి వినతిపత్రం అందజేశారు.  కొద్ది నెలలుగా తమ షాపులపై అధికారులు  నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎండీఎం ఆపరేటర్లకు అవే సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించిన అధికారులు, తమపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మొరపెట్టుకున్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని తహసీల్దారు  చెప్పడంతో డీలర్లు వెళ్లిపోయారు.