కరోనా కేసుల్లో పెరుగుదల.. కేరళ ప్రభుత్వం తప్పు చేసింది: సంబిత్ పాత్రా

ABN , First Publish Date - 2021-07-29T00:33:39+05:30 IST

కేరళలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటడానికి కేరళ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత సంబిత్ పాత్రా తాజాగా వ్యాఖ్యానించారు.

కరోనా కేసుల్లో పెరుగుదల.. కేరళ ప్రభుత్వం తప్పు చేసింది: సంబిత్ పాత్రా

న్యూఢిల్లీ: కేరళలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటడానికి కేరళ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత సంబిత్ పాత్రా తాజాగా వ్యాఖ్యానించారు. ఇది సెకెండ్ వావ్ కాదని, మరో కొత్త వేవ్‌‌ ప్రారంభానికి సంకేతమని వార్తలు వచ్చిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. జూన్ 6 తరువాత అత్యధిక కేసులు బయటపడిన ఒకే ఒక రాష్ట్రం కేరళ అని సంబిత్ పేర్కొన్నారు. అంతకుమనుపు కేరళలోనూ కరోనా ఉధృతి తగ్గుతూవచ్చిందని తెలిపారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కారణంగా తప్పులు జరిగాయని, పర్యవసానంగా.. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందని వ్యాఖ్యానించారు. గత నాలుగు వారాలుగా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందన్న ఆయన..కేరళ పాజిటివిటీ రేటు 12.35 శాతానికి చేరుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-07-29T00:33:39+05:30 IST