సంబురంగా సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-17T04:01:22+05:30 IST

భోగ భాగ్యాలందించే భోగి...

సంబురంగా సంక్రాంతి
ఆమనగల్లులో పాలు పొంగిస్తున్న కుటుంబ సభ్యులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ ) : భోగ భాగ్యాలందించే భోగి... సకల శుభాలు, సౌఖ్యాలనిచ్చే సంక్రాంతి, కనువిందు చేసే కనుమ, ముచ్చటైన మూడు విశేషాల పెద్ద పండగ మకర సంక్రాంతిని ఉమ్మడిజిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు.. రేగుపళ్లు... ముత్యాల ముగ్గులు.. గొబ్బెమ్మలు.. పొంగే పాలు.. సన్నాయి రాగాల మధ్య డూడూ బసవన్నలు సందడి చేశారు. కొత్త అల్లుళ్లు... బంధుమిత్రుల నడుమ పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మూడు రోజుల ముచ్చటైన పండగలో.. ప్రతి ఇంటిముందు అందమైన రంగవల్లులు కొలువుదీరాయి. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కేరింతలు కొడుతూ గాలిపటాలు ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. 



Updated Date - 2022-01-17T04:01:22+05:30 IST