అంబరాన్నంటిన సంబురాలు

ABN , First Publish Date - 2022-01-17T04:46:06+05:30 IST

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

అంబరాన్నంటిన సంబురాలు
లంకాల గ్రామంలో నిర్వహిస్తున్న ట్రాక్టర్‌ రివర్స్‌ పోటీలు

- రంగురంగుల ముగ్గులు వేసిన మహిళలు

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

- ఆయా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం

నారాయణపేట, జనవరి 16 : భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్ల ముంగిట్లో సర్వాంగ సుం దరంగా రంగురంగుల రంగ వల్లికలను వేసి మహిళలు తమ నైపుణ్యాన్ని చాటుకు న్నారు. చిన్నారులు పతంగులను ఎగుర వేశారు. ప్రత్యేక తీపి వంటకాలను తయారు చేసి భుజించారు. ఏడాదిలోపు చిన్నారులకు రేగి పండ్లను తలపై వేశారు. కనుమను పురస్కరించుకొని పశువుల పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. ముక్కో టి దేవతలకు నిలయమైన గోమాతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శని త్రయోదశి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని బారంబావి వద్ద కొలువైన శనైశ్వరుడికి భక్తులు నూనే, నల్ల వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

విజేతలకు బహుమతులు ప్రదానం

సంక్రాంతి సందర్భంగా నారాయణపేట 8వ వార్డు పరమారెడ్డి కాలనీలోని ఇళ్ల ముందు మహిళలు వేసిన ముగ్గులను పరి శీలించి విజేతలకు కాలనీ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ గౌరవాధ్యక్షుడు చెన్నారెడ్డి, సభ్యులు శనివారం బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు నేహ, మహిత, మంజుల సాధించారు. అదే విధంగా ఇండియన్‌ ఆర్మీడే సందర్భంగా భారత సైనికుడు అంజిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాలనీవాసులు గందె చంద్రకాంత్‌, చెన్నారెడ్డి, కృపాకర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, రాంచంద్రారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

చికెన్‌ షాపులు కిటకిట 

సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ ఆదివారం మాంసం ప్రియులకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలో చికెన్‌ కిలో రూ.220, మాంసం కిలో రూ.600 పలకగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆయా దుకాణాల ముందు పట్టణ ప్రజలు సింగారం చౌరస్తాలో పెద్ద ఎత్తున బారులు తీశారు. దీంతో ఆ ప్రాంతం సంద డిగా మారింది. 

నారాయణపేట రూరల్‌ : మండలంలోని కోటకొండ, కొల్లంపల్లి, జాజాపూర్‌, చిన్నజట్రం, లక్ష్మీపూర్‌, బోయిన్‌పల్లి, పేరపళ్ల, భైరంకొండ, ఎక్లాస్‌పూర్‌ గ్రామాల్లో సంక్రాంతి, కనుమ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర ్భంగా ఎక్లాస్‌పూర్‌, కొల్లంపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకరికొకరు నువ్వులు, బెల్లం ఇచ్చి పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. చిన్నారులపై రేగిపళ్ళను వేసి ఆశీర్వదించారు. 

మరికల్‌ : మండల కేంద్రంలో సంక్రాంతి, కనుమ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.  గ్రామాల్లో ఆటపాటలతో యువతీయువకులు సందడిగా కనిపించారు. పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.

మక్తల్‌ : సంక్రాంతి, కనుమ వేడుకలను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలకంరించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి యువకులు, చిన్నారులతో కలిసి గాలి పటాలు ఎగురవేశారు. పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయం, ఉ మా మహేశ్వరాలయం, వేంకటేశ్వరస్వామి, వాసవీ కన్యకాపరమేశ్వరి, మల్లికార్జునస్వామి ఆలయం, నల్లజానమ్మ ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహించారు. 

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని దాసరిదొడ్డిలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా శనివారం క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు గొల్ల మారెప్ప, సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి గోవింద్‌రాజు, కటికల సత్యనారాయణ, పట్వారి నారాయణ, డీవైఎఫ్‌ఐ శివప్ప, ఎల్లప్ప, బొంబాయి సూరి, హృదయ్‌, రవి, అజయ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంజుల, అనిత, కల్యాణి పాల్గొన్నారు.

నర్వ : మండల కేంద్రంతో పాటు మండంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి, కనుమ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని లంకాలలో ట్రాక్టర్‌ రివర్స్‌ పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతి లంకాల గ్రామం దుప్పల్లి వెంకటేష్‌కు 5 తులాల వెండి, ద్వితీయ బహుమతి మరికల్‌ గ్రామం జేసీబీ రఘుకు మూడు తులాల వెండి, తృతీయ బహుమతి మక్తల్‌ మండలం ముష్టిపల్లికి చెందిన వెంకటేష్‌కు రెండు తులాల వెండిని గ్రామానికి చెందిన కీ.శే. ఎల్‌కె బుచ్చన్న స్మారకార్థం ఆయన కుమారులు నాగరాజు, నరేందర్‌ అందజేశారు. రైతు సమితి మండలాధ్యక్షుడు  చిన్నయ్య, టీవీఎస్‌ చెన్నయ్య, ఉపసర్పంచ్‌ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మం డలంలోని ఆయా గ్రామాలకు చెందిన 105 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో రత్నాకర్‌రెడ్డి, బాలకృష్ణ, కోట్ల శీను, నరేష్‌, సత్య న్న, రఘురెడ్డి, పాండు పాల్గొన్నారు

మాగనూరు : సంక్రాంతి, కనుమ వేడుకలను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పో టీలు నిర్వహించగా సర్పంచు రాజు, ఎంపీపీ శ్యామలమ్మ పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీవై ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బాబు, సీపీఎం జిల్లా నాయకుడు ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాఘవేంద్ర, నరేష్‌, మాజీ సర్పంచులు ఆనంద్‌గౌడ్‌, బాబుదాస్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

ధన్వాడ : మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కిష్టాపూర్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించి సర్పంచ్‌ చిట్టెం దామోదర్‌రెడ్డి బహుమతులను అందించారు. కొండాపూర్‌లో కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.

ఊట్కూర్‌ : మండలంలో సంక్రాంతి, కనుమను ప్రజలు కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేయగా యువకులు పతం గులను ఎగరవేయంలో మునిగిపోయారు. పెద్దపొర్లలో శనివారం రాత్రి జై భీం సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు అనిల్‌ పాల్గొన్నారు.

కోస్గి : సంక్రాంతి సంబురాలను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగులతో అందమైన రంగువల్లులను వేసి ఆకట్టుకున్నారు. చిన్నారులు, యువకులు గాలిపటాలను ఎగరవేసేందుకు పోటీ పడ్డారు. విశ్వహిందు పరిషత్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. ఎకో ఫ్రెండ్లీ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కళాశాల మైదానంలో నిర్వహించిన గాలిపటాల పోటీల్లో పట్టణానికి చెందిన  మహేశ్‌కుమార్‌ వరుసగా ఏడోసారి విజేతగా నిలిచి బహుమతిని అందుకున్నారు. 





Updated Date - 2022-01-17T04:46:06+05:30 IST