అయినా...అదే కథ!

ABN , First Publish Date - 2020-12-01T06:21:08+05:30 IST

సాధ్యమైనంత ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనడం ద్వారా పోటీతత్వం పెరిగి ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడడమే బిడ్ల ముఖ్య ఉద్దే శం.

అయినా...అదే కథ!

ఆర్‌అండ్‌బీ టెండర్లకు స్పందన కరువు   

గతంలో రెండు, ఇప్పుడు మూడే

ఒంగోలు(జడ్పీ), నవంబరు 30 : సాధ్యమైనంత ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనడం ద్వారా పోటీతత్వం పెరిగి ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడడమే బిడ్ల ముఖ్య ఉద్దే శం. జిల్లాలో ఆర్‌అండ్‌బీకి సంబంధించి ఏడు రోడ్ల పనులకు గతంలో ఒకసారి టెండర్లు పిలిస్తే రెండంటే రెండు బిడ్లు మాత్రమే  వచ్చాయి. అప్పటి ప్రక్రియపై ఆరోపణలు వెల్లువె త్తడంతో ఆ తతంగం మొత్తాన్ని అటకెక్కించి మరోసారి తాజా గా టెండర్లకు శ్రీకారం చుట్టారు. ఈదఫా నిబంధనలను కూ డా సడలించారు. తొలిసారి జాతీయ బ్యాంకుల గ్యారెంటీ మా త్రమే అనుమతించిన వారు రెండోసారి షెడ్యూల్‌ బ్యాంకులకు కూడా దానిని వర్తింపజేశారు. అయినప్పటికీ ఆశించిన స్పందన కొరవడింది. నాలుగు టెండర్లు మాత్రమే దాఖలవ్వగా వాటిలో ఒక దానిని సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. మిగిలింది మూడు అంటే గతంలో కంటే ఒకటి పెరిగింది. తదుపరి ప్రక్రియ ప్రారంభిస్తే వీరు ముగ్గు రూ రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనే అవకాశముంది.


స్పందన కరువు

ఈ దఫా టెండర్ల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఫ్రీబిడ్‌ సమావేశాలు కూడా నిర్వహించారు. అయి నప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ పని దక్కించుకోవాల్సిన సంస్థ గత ఐదేళ్లలో ప్రస్తుత పని విలువలో 80శాతం (రూ. 160 కోట్ల) మేర పని చేసి ఉండాలి.  ఈ స్థాయి కలిగి స్థానికంగా ఉండే కాంట్రాక్ట ర్లు, సంస్థలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పరిమిత సంఖ్యలో ఉన్నవారు సైతం దూరంగా ఉండటంతో స్పందన నామమాత్రంగానే ఉంది.


ఈసారి ఏం చేస్తారో....

గతంలో రెండే టెండర్లు వచ్చాయని ప్రక్రియ మొత్తాన్ని రద్దుచేసి మళ్లీ ఆహ్వానించారు. ఈసారి కూడా పెద్దగా పురో గతి లేదు. ఒక్కటంటే ఒక్కటి పెరిగింది. నిబంధనల ప్రకారం తక్కువ కోట్‌ చేసిన మొత్తంతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ ప్రక్రియ మొదలుపెట్టి టెండర్లను ఖరారు చేస్తారో లేక పునరాలోచన చేసి ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2020-12-01T06:21:08+05:30 IST