మీ సినిమా షూటింగ్ అనుకుంటున్నారా..? చెప్పిన టైమ్‌కు రారా..? Ananya Panday కు Sameer Wankhede వార్నింగ్

బాలీవుడ్‌లో సంచలనం రేపిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఆర్యన్ వాట్సాప్ ఛాట్ ఆధారంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముందుకు వెళుతున్నారు. ఆర్యన్‌తో డ్రగ్స్ ఛాట్ చేసిందనే కారణంతో బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండేను ఎన్‌సీబీ అధికారులు గురువారం విచారించిన సంగతి తెలిసిందే. ఎన్‌సీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు అనన్య ముక్తసరిగా సమాధానాలు చెప్పిందని వార్తలు వచ్చాయి. 


గురువారం రెండు గంటల పాటు అనన్యను ఎన్‌సీబీ అధికారులు విచారించారు. అనంతరం మళ్లీ శుక్రవారం ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే చెప్పిన సమయానికి కాకుండా మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం రెండు గంటలకు అనన్య విచారణకు హాజరైంది. దీంతో ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. `ఇదేం సినిమా షూటింగ్ కాదు.. చెప్పిన సమయానికి కచ్చితంగా రావాల్సిందే.. ఇకపై ఆలస్యం చేయవద్దు` అని హెచ్చరించారట. శుక్రవారం దాదాపు 4 గంటల పాటు అనన్యను ప్రశ్నించారు. మళ్లీ సోమవారం ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.   

Advertisement