Sep 22 2021 @ 16:43PM

పెళ్ళయినా తగ్గేదేలే అంటోన్న సమీరా

ఒకప్పుడు సౌత్ లో గ్లామర్ గాళ్ గా సత్తా చాటుకుంది బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి.  బాలీవుడ్ తో పాటు వివిధ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.  2013లో వరదనాయక కన్నడ మూవీలో నటించిన తర్వాత అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2014 లో మహారాష్ట్రకి చెందిన బిజినెస్ మేన్ అక్షయ్ వార్ధేని పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ దంపతులకు ఇప్పుడు కొడుకు, కూతురు. సినిమాల్ని పక్కన పెట్టినప్పటికీ సమీరా సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. ఎఫ్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్ తో పాటు తన గ్లామరస్ పిక్స్ ను కూడా పోస్ట్ చేస్తూ .. ఫాలోవర్స్ ను బాగానే పెంచుకుంది. 

రీసెంట్ గా సమీరా రెడ్డి.. తన భర్త అక్షయ్ తో కలిసి ఒక బీచ్ లో బికినీలో రివీలైంది. పెళ్ళయినప్పటికీ తాను అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ నెటిజెన్స్ ను కవ్విస్తోంది. ప్రస్తుతం సమీరా బికీనీ ఫోటోస్ ఇన్ స్టా ను వేడెక్కిస్తున్నాయి. తన భర్తతో కూడా బికినీ లో రివీలైన పోజులు ఆకట్టుకుంటున్నాయ్. వైట్ అండ్ బ్లాక్ స్ట్రాప్స్ తో కూడిన ఆమె బికినీ పోజులతో .. అమ్మడికి మళ్ళీ అవకాశాలేమైనా వస్తాయేమో చూడాలి.