Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేరుకే అది సమోసా మహల్.. అక్కడ అది దొరకదు ఆ వాసనా తగలదు.. మరి ఆ పేరు ఎందుకొచ్చిందంటే..

సమోసా పేరు వినగానే అందరికీ నోరూరిపోతుంటుంది. అయితే మీరెప్పుడైనా సమోసా మహల్‌ను చూశారా? అయితే ఈ సమోసా ప్యాలెస్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. మొఘలుల రాజధాని ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీలో ఈ సమోసా మహల్ ఉంది. ఈ పేరు చూసి ఇక్కడ సమోసా దొరుకుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఈ మహల్ త్రికోణపు ఆకారంలో ఉండటం వలన దీనికి సమోసా మహల్ అనే పేరు వచ్చింది. 

దీర్ఘకాలంగా ఈ మహల్ శిథిలావస్థలోనే ఉంది. ఇటీవలే ఈ మహల్‌కు మరమ్మతు పనులు జరిగాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 17 లక్షలు వెచ్చించింది. కాగా ఫతేపూర్‌లోని పలు పురాతన కట్టడాలకు గల పేర్లు వివాదాస్పదంగా ఉన్నాయి. కాగా సమోసా అనేది ముందుగా ఇరాన్ నుంచి భారత్ వచ్చిందని తెలుస్తోంది. పార్సీ చరిత్రకారుడు అబుల్ ఫజల్ ఈ సమోసా గురించి 11వ శతాబ్దంలో ప్రస్తావించారు. పోర్చుగల్ ప్రజలు భారత్ వచ్చినప్పుడు తమతోపాటు ఆలూ, సమోసా తీసుకువచ్చినట్లు చరిత్ర చెబుతోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement