టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అని ప్రూవ్ చేస్తూ.. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి చిత్రాలతో.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆయన హీరోగా ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'బజారు రౌడీ'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే భారీ తారాగణంతో క్లైమాక్స్‌ని షూట్ చేశారు. అంతేకాదు టాలీవుడ్ క్రేజీ కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ సారధ్యంలో ఒక సాంగ్‌ని చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల సారధి స్టూడియోలో మొదలయ్యాయి. అన్ని కమర్షియల్ హంగులతో దర్శకుడు వసంత నాగేశ్వరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చిత్రయూనిట్ తెలుపుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
'ఆర్య' చిత్రంలో మూన్ వాక్ స్టెప్ వేయించి యూత్‌లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ సారధ్యంలో.. గుంటూరు జిల్లా కొండవీడు గ్రామ అందాల మధ్యలో హీరో సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మహేశ్వరి వద్దిలపై ఓ సాంగ్‌ను చిత్రీకరించినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని, రేపు థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రాన్ని కెఎస్ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని, అలాగే చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.