విభిన్న కథాచిత్రాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘బజారు రౌడీ’. ‘‘గుంటూరు జిల్లా కొండవీడు గ్రామంలో ఇటీవల సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మహేశ్వరిపై ఓ పాట చిత్రీకరించాం. నృత్య దర్శకుడు నిక్సన్ మా హీరోతో అద్భుతమైన స్టెప్స్ వేయించారు. థియేటర్లకు వచ్చే అభిమానులకు ఈ సాంగ్ పండగలా ఉంటుంది. దర్శకుడు వసంత నాగేశ్వరరావు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత నందిరెడ్డి శ్రీనివాసరావు చెప్పారు.