శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్

ABN , First Publish Date - 2020-11-10T22:48:41+05:30 IST

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై ధరలను తగ్గించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధరలను తగ్గించినట్లు నివేదిక స్పస్టం చేసింది.


భారత మార్కెట్‌లో గత సంవత్సరంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. విడుదల చేసినప్పుడు గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 69,999 ఉండగా, డిస్కౌంట్‌తో రూ. 57,100కే విక్రయించారు. గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు సుమారు రూ.25 వేల వరకు తగ్గించినట్లు తెలుస్తోంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఫోన్ ప్రస్తుతం రూ. 45000 లభించనుంది.

Updated Date - 2020-11-10T22:48:41+05:30 IST