క్యూలెడ్ 8కె టీవీలను లాంచ్ చేసిన శాంసంగ్.. రూ. 6.30 లక్షల వరకు రాయితీ

ABN , First Publish Date - 2020-10-25T03:23:14+05:30 IST

శాంసంగ్ నుంచి మరో భారీ ఆఫర్ వచ్చేసింది. ప్రీమియం క్యూలెడ్ 8కె టీవీలను లాంచ్ చేసిన శాంసంగ్ ‘ది 8కె ఫెస్టివల్’ పేరుతో ఆఫర్లకు తెరతీసింది.

క్యూలెడ్ 8కె టీవీలను లాంచ్ చేసిన శాంసంగ్.. రూ. 6.30 లక్షల వరకు రాయితీ

న్యూఢిల్లీ: శాంసంగ్ నుంచి మరో భారీ ఆఫర్ వచ్చేసింది. ప్రీమియం క్యూలెడ్ 8కె టీవీలను లాంచ్ చేసిన శాంసంగ్ ‘ది 8కె ఫెస్టివల్’ పేరుతో ఆఫర్లకు తెరతీసింది. ఇందులో భాగంగా రూ. 6,30,000 వరకు రాయితీతో ప్రత్యేక ధరలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రికల్ రిటైలర్ షాపులలో ఈ నెల 24 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 


ఆఫర్‌లో భాగంగా 85 అంగుళాలు, 82 అంగుళాలు, 75 అంగుళాల శాంసంగ్ క్యూలెడ్ 8కె టీవీల కొనుగోలుపై శాసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ లభిస్తుంది. 65 అంగుళాల క్యూలెడ్ 8కె టీవీ మోడళ్ల కొనుగోలుపై వినియోగదారులకు గెలాక్సీ ఎ31 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. అలాగే అన్ని క్యూలెడ్ 8కె రేంజ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 65 అంగుళాల మోడళ్లపై రూ. 1,30,000 నుంచి రూ. 1,80,000 వరకు ఇస్తుండగా, 75 అంగుళాల మోడళ్లపై రూ.3,50,000, 82, 85 అంగుళాల టీవీలపై రూ. 5,00,000 నుంచి రూ. 6,30,000 వరకు రాయితీ ప్రకటించింది. 


ఇవి కాకుండా వినియోగదారులకు ఈఎంఐ ఆప్షన్లతో రూ. 20 వేలకు అదనంగా క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే మూడేళ్ల వారెంటీ కూడా లభిస్తుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ క్యూలెడ్ 8కె టీవీ ఇండస్ట్రీలో తొలి 8కె టీవీ కావడం విశేషం. 8కె పిక్చర్ నాణ్యత, అదిరిపోయే సౌండ్ వంటివి ఉన్నాయి. ఇందులోని ‘ఇన్ఫినిటీ స్క్రీన్’ కారణంగా వీక్షకులకు అద్భుతమైన అనుభవం సొంతమవుతుంది. రియల్ 8కె రిజల్యూషన్, 8కె ఏఐ అప్‌స్కేలింగ్, క్వాంటమ్ ప్రాసెసర్ 8కె, క్వాంటమ్ హెచ్‌డీఆర్ వంటివి శాంసంగ్ క్యూలెడ్ 8కె టీవీలో ఉన్నాయి. 

Updated Date - 2020-10-25T03:23:14+05:30 IST