ఇండియాలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 02ఎస్, గెలాక్సీ ఎఫ్ 12

ABN , First Publish Date - 2021-04-06T02:46:52+05:30 IST

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో మరో రెండు ఫోన్లు వచ్చేశాయి. తాజాగా నేడు గెలాక్సీ ఎఫ్02ఎస్, గెలాక్సీ ఎఫ్12లను

ఇండియాలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 02ఎస్, గెలాక్సీ ఎఫ్ 12

న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో మరో రెండు ఫోన్లు వచ్చేశాయి. తాజాగా నేడు గెలాక్సీ ఎఫ్02ఎస్, గెలాక్సీ ఎఫ్12లను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రెండూ వాటర్ డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే నాచ్‌తో వచ్చాయి. గెలాక్సీ ఎఫ్02ఎస్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండగా, గెలాక్సీ ఎఫ్ 12లో నాలుగు కెమెరాలు ఉన్నాయి.  శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్.. గెలాక్సీ ఎం02 కొత్త పేరుతో రీలాంచ్ చేసినట్టు కనిపిస్తుండగా, గెలాక్సీ ఎఫ్ 12 మాత్రం గెలాక్సీ ఎ12కు రీబ్రాండెడ్ వెర్షన్. 


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజీ ధర రూ. 8,999 కాగా, 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 9,999 మాత్రమే. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ కన్ఫిగరేషన్ ధర రూ. 10,999 కాగా, 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 11,999 మాత్రమే. గెలాక్సీ ఎప్02ఎస్ ఈ నెల 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎఫ్ 12 మాత్రం ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్‌తోపాటు ముఖ్యమైన రిటైలర్ల వద్ద కూడా లభిస్తాయి.  


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్,13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా,  64 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. 


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, సెల్పీల కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా,128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, బండెల్డ్ చార్జర్‌తో 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్.

Updated Date - 2021-04-06T02:46:52+05:30 IST