చిప్‌ అమ్మకాల్లో శాంసంగ్‌దే హవా

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన సాంకేతిక దిగ్గజం శాంసంగ్‌, చిప్‌ అమ్మకాల్లో ఇంటెల్‌ను తోసిరాజని టాప్‌లోకి వచ్చింది. గత ఏడాది రెవెన్యూ ప్రకారం శాంసంగ్‌ టాప్‌లో ఉన్నట్టు తేలింది.....

చిప్‌ అమ్మకాల్లో శాంసంగ్‌దే హవా

దక్షిణ కొరియాకు చెందిన సాంకేతిక దిగ్గజం శాంసంగ్‌,  చిప్‌ అమ్మకాల్లో ఇంటెల్‌ను తోసిరాజని టాప్‌లోకి వచ్చింది. గత ఏడాది రెవెన్యూ ప్రకారం శాంసంగ్‌ టాప్‌లో ఉన్నట్టు తేలింది. శాంసంగ్‌కు సంబంధించి సెమికండక్టర్‌ అమ్మకాల్లో 31.6 శాతం మేర పెరిగిందని తద్వారా ఆదాయం 75.9 బిలియన్‌ డాలర్లను తాకిందని అమెరికాకు చెందిన రీసెర్చ్‌ సంస్థ ‘గార్టనర్‌’ తెలిపింది. అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే శాంసంగ్‌ మెమరీ బిజినెస్‌ల  34.2 శాతం మేర పెరిగింది. మొత్తంగా గత ఏడాది చూసుకుంటే సెమికండక్టర్‌ మార్కెట్‌ పెరుగుదల 25.1 శాతం 583.5 డాలర్ల మేరకు నమోదైంది. ఇంటెల్‌ అమ్మకాలు మాత్రం 0.5 శాతం పెరిగి, 73.1 మిలియన్‌ డాలర్లను మాత్రమే రికార్డయింది. అమెరికాకు చెందిన క్వాల్కామ్‌, తైవాన్‌కు చెందిన మీడియా టెక్‌ వరుసగా అయిదు, ఏడు స్థానాలను ఆక్రమించాయి. 

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST