Oct 21 2021 @ 12:33PM

Samantha : బెస్ట్ ఫ్రెండ్ తో తీర్థయాత్రలు!

అక్కినేని నాగచైతన్య, సమంత ఇటీవల బ్రేక్ అప్ అయిన సంగతి తెలిసిందే. విడిపోయి విడివిడిగా ఉంటున్నా.. ఇద్దరిపై ఇంకా రూమర్స్, కథనాలు వస్తూనే ఉన్నాయి. అందుకే సామ్.. కాస్తంత ప్రశాంతత కోరుకుంటోంది. భగవద్దర్శనంతోనే అది సాధ్యమవుతుందని భావిస్తోంది. తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తోంది. ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ ని సమంతా అండ్ శిల్పారెడ్డి చుట్టేస్తున్నారు. యమునోత్రిలోని అద్భుతమైన ప్రదేశాల్ని, అందమైన లొకేషన్స్ ను వీరిద్దరూ ఎంజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని శిల్పారెడ్డి తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది. హెలీకేఫ్టర్ ముందు సమంతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ టేకాఫ్.. మొదట యమునోత్రికి వెళుతున్నాం అంటూ ఫోటోస్ ను షేర్ చేశారు. 



ఇక ఇన్ స్టా స్టోరీస్ లో దైవదర్శనం చేసుకున్న తర్వాత ఓ ఫోటో షేర్ చేస్తూ.. చార్ ధామ్ యాత్ర.. ఎప్పటికీ మన స్నేహం చెరిగిపోదు అనే వ్యాఖ్యను జతచేశారు శిల్పారెడ్డి. టూర్ లో భాగంగా గంగానదిని, అక్కడ వశిష్ట తీరాన్ని ఇద్దరూ సందర్శించారు. ఆ ఫోటోస్ ను , వీడియోస్ ను శిల్పారెడ్డి తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేయగా. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా బ్రేక్ అప్ అనంతరం.. ఎదురైన సోషల్ మీడియా రచ్చని సామ్.. ఇలా మరిచిపోయే ప్రయత్నం చేస్తుండడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.