రేడియో మెకానిక్ కుమార్తె.. ఆకాశవాణి వ్యాఖ్యాత.. సక్సెస్ స్టోరీ

ABN , First Publish Date - 2021-04-20T01:17:37+05:30 IST

నిజామాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రేడియో మెకానిక్ చిలకమర్రి రంగాచార్యులు,శిలా రాణి దంపతుల కుమార్తె మాధురి నిజామాబాద్‌లో రేడియో వ్యాఖ్యాతగా

రేడియో మెకానిక్ కుమార్తె.. ఆకాశవాణి వ్యాఖ్యాత.. సక్సెస్ స్టోరీ

నిజామాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రేడియో మెకానిక్ చిలకమర్రి రంగాచార్యులు,శిలా రాణి దంపతుల కుమార్తె మాధురి నిజామాబాద్‌లో రేడియో వ్యాఖ్యాతగా ఎంపికై ఆకాశవాణి ఎఫ్ఎంలో పనిచేస్తున్నారు. పదేళ్లుగా ఆకాశవాణితో అనుబంధం ఉన్న మాధురి ఓ సాధారణ గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే నేడు తన పని తీరుతో సీనియర్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎంఏ, బిఈడీ చేసిన మాధురి 18 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. రామకృష్ణ మఠంతో అనుబంధం కలిగి ఉండటం తన సక్సెస్‌కు కారణమంటున్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలే తనలో సానుకూల మార్పునకు కారణమని మాధురి చెబుతున్నారు.


న్యూనతాభావం పురోగతికి అవరోధంగా మారిన సమయంలో స్వామి వివేకానంద సాహిత్యం చదివాక ఏదైనా సాధించాలనే లక్ష్యం పెట్టుకుని రేడియోకు ఎంపికైనట్లు మాధురి చెప్పారు. నేడు వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, జర్నలిస్ట్‌గా, న్యూస్ రీడర్‌గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఓ సాధారణ రేడియో మెకానిక్ కుమార్తె రేడియో వ్యాఖ్యాతగా కావడానికి అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియోకు ఆమె నిరంతరం కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. తన ఆత్మీయ మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే నేడు తన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించగలుగుతున్నట్లు చెప్పారు. 


ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంప్రదాయాలతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను అందించాలనే ఉద్దేశంతో మధుర టాక్స్ ప్రారంభించినట్లు మాధురి తెలిపారు.


మాధురి నటించిన అమ్మేకదా, నాన్నే కదా అనే వీడియో సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.  

Updated Date - 2021-04-20T01:17:37+05:30 IST