Jun 7 2021 @ 21:55PM

చివరికి ఓటీటీలోనే వదులుతున్నారు

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో తమతమ ఇళ్ళకే పరిమితమైన ప్రజలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇటీవలి కాలంలో అనేక కొత్త చిత్రాలతోపాటు వెబ్‌సిరీస్‌లు ఇందులో ప్రసారమవుతున్నాయి. ఒకవేళ కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వచ్చి థియేటర్లు తెరుచుకున్నప్పటికీ... ప్రజలు థియేటర్లకు వెళ్ళేందుకు పెద్దగా ఆసక్తిచూపించకపోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ ధరకే ఇంటిల్లపాదికీ ఓటీటీలు వినోదాన్ని పంచుతున్నాయి. దీనికితోడు, థియేటర్లలో టిక్కెట్‌ ధర వందల రూపాయల్లో ఉంది. దీన్ని గ్రహించిన అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


తాజాగా, సుబ్రమణ్య శివ దర్శకత్వంలో సముద్రఖని నటించిన చిత్రం ‘వెళ్ళైయానై’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇందులో ఆత్మికా హీరోయిన్‌గా నటించగా యోగిబాబు కీలక పాత్రను పోషించారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రస్తుత కాలంలో వ్యవసాయం ఏ విధంగా కనిపించకుండా పోతుందో తెలియజెప్పేలా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది ఆరంభంలోనే ముగిసి విడుదలకు సిద్ధమైంది. కానీ, కరోనా వ్యాప్తి, థియేటర్లు మూసివేత వంటి సమస్యలు ఎదురైనప్పటికీ.. థియేటర్లలోనే విడుదల చేయాలన్న పట్టుదలతో నిర్మాతలు ఉన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో.. ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి విష్ణు రంగస్వామి డీవోపీగా పనిచేశారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...