Abn logo
Aug 6 2021 @ 20:36PM

యాక్షన్ సినిమాను తలపించే సీన్.. ఏకే47 గన్‌తో యువతి హల్‌చల్

వాషింగ్టన్: కారు పరుగులు తీస్తున్నప్పుడు.. అందులోంచి ఒకరు బయటకు వచ్చి, ఆయుధాలతో ప్రత్యర్థులను దాడి చేసే దృశ్యాలు సాధారణంగా యాక్షన్ సినిమాల్లో చూస్తూంటాం కదా. యాక్షన్ సినిమాల్లో కనిపించే సీన్‌ తరహా ఫొటోనే ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఓ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్న ఓ యువతి.. కారు వేగంగా కదులుతున్న సమయంలో కిటికీ గుండా బయటికొచ్చి ఏకే 47గన్‌ను ప్రదర్శించారు. ఈ ఘటన గత నెల 11న జరగగా, అందుకు సంబంధించిన ఫొటోను స్థానిక పోలీసులు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. చట్టవిరుద్ధమైన పోటీలో పాల్గొనడమే కాకుండా కారు నుంచి బయటికొచ్చి మరీ ఓ ప్యాసింజర్ గన్‌ను ప్రదర్శించినట్టు తెలిపారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, తాజాగా ఆ కారును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట్ వైరల్‌గా మారింది. దీన్ని చూసి స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


అమెరికా నగరాల్లోమరిన్ని...