Abn logo
Nov 22 2020 @ 14:08PM

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ సనాఖాన్‌

Kaakateeya

తెలుగులో నాగార్జున 'గగనం', కల్యాణ్‌రామ్‌ 'కత్తి', మనోజ్‌ 'మిస్టర్‌ నూకయ్య' చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సనాఖాన్‌ తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 6లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే రీసెంట్‌ టైమ్‌లో ఆమె తాను సినీ రంగానికి దూరం కాబోతున్నానంటూ ప్రకటించారు. ఇలా ప్రకటించిన కొన్ని రోజులకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు సనాఖాన్‌. గుజరాత్‌కి చెందిన ముఫ్తి అనాస్‌ను సనా ఖాన్‌ పెళ్లి చేసుకుంది. భర్తతో సనాఖాన్‌ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 


Advertisement
Advertisement