నాలా నుంచి మంటలు

ABN , First Publish Date - 2021-01-11T06:42:13+05:30 IST

సనత్‌నగర్‌ పారిశ్రామిక

నాలా నుంచి మంటలు

సనత్‌నగర్‌లో కలకలం

సనత్‌నగర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని నాలా నుంచి మంటలు రావడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి యూసుఫెయిన్‌ ఫర్నిచర్‌ సమీపంలో వెళ్తున్న నాలా నుంచి ఘాటైన వాసనలు వస్తున్నాయి. ఇది స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. సుమారు 5 గంటల ప్రాంతంలో భవనం వెనుక వైపు ఉన్న ఓ నాలా నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రజలు చూస్తుండగానే పెద్దఎత్తున పొగలు, మంటలు అలుముకోవడంతో భయాందోళన చెందారు. సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో అక్కడకు చేరుకుని 20 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రెండు గంటలపాటు ఘాటైన వాసనలు ఉక్కిరిబిక్కిరి స్థానికులు తెలిపారు. 


గతంలోనూ ఇదే నాలాలో...

గతంలో ఇదే నాలాలో సంభవించిన పేలుడు చాలా ప్రమాదాన్ని సృష్టించింది. సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు నాలాలోకి  పేరుకుపోయి తీవ్ర పీడనానికి గురై భారీ శబ్దంతో మ్యాన్‌హాల్‌ పేలిన సంఘటన జరిగింది. ఆ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనం శ్లాబు కూలింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘాటైన వాసనలు మాత్రం ఇక్కడ పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2021-01-11T06:42:13+05:30 IST