ఇసుక మాఫియా నుంచి రూ.లక్షల్లో వసూళ్లు

ABN , First Publish Date - 2020-12-05T06:05:00+05:30 IST

సిద్దిపేట, డిసెంబరు4: చిన్నకోడూరు ఎస్‌ఐ సాయికుమార్‌, సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని మానవ హక్కుల కమిషన్‌, గవర్నర్‌, సీఎంవో, డీజీపీ, ఐజీ, సిద్దిపేట, సీపీకి ఫిర్యాదు చేసినట్లు బాధితులు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇసుక మాఫియా నుంచి రూ.లక్షల్లో వసూళ్లు

 ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులు 

 మానవ హక్కుల కమిషన్‌, గవర్నర్‌, సీఎంవో, డీజీపీ, ఐజీ, సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు  

 

సిద్దిపేట, డిసెంబరు4: చిన్నకోడూరు ఎస్‌ఐ సాయికుమార్‌, సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి  నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని మానవ హక్కుల కమిషన్‌, గవర్నర్‌, సీఎంవో, డీజీపీ, ఐజీ, సిద్దిపేట, సీపీకి ఫిర్యాదు చేసినట్లు బాధితులు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణాపై 100కు లేదా ఎస్‌ఐ, సీఐకి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయకుండా, ఫిర్యాదు చేసిన తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  తమ వివరాలను ఇసుక మాఫియాకు తెలియజేసి దాడులు చేయిస్తున్నారని వాపోయారు. ఎస్‌ఐ, సీఐలపై మానవహక్కుల కమిషన్‌, గవర్నర్‌, సీఎంవో, డీజీపీకి, ఐజీ, ఇంటెలీజెన్స్‌ ఐజీ,   సిద్దిపేట సీపీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫిర్యాదులను వాపస్‌ తీసుకోవాలని  ఒత్తిడి  తెస్తున్నారని తెలిపారు. ఇసుక మాఫి యా, పోలీసులతో తమకు ప్రాణ భయం ఉం దని వారు  వాపోయారు.  సమావేశంలో బాధితులు  మీసం మహేందర్‌, పిల్లి బాబు, ఉడుత జయంత్‌, కోడెల నాగరాజు, జక్కుల నాగరాజు, యారమహేష్‌, ముత్యాల తిరుపతియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T06:05:00+05:30 IST