ఇసుక డంప్‌లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-04T10:24:20+05:30 IST

: జమ్మలమడుగులో బుధవారం ఇసుక డంప్‌లపై ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని

ఇసుక డంప్‌లు స్వాధీనం

జమ్మలమడుగు రూరల్‌, మే 3: జమ్మలమడుగులో బుధవారం ఇసుక డంప్‌లపై ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని మునిరెడ్డి కాలనీలో మల్లికార్జునరెడ్డి ఇంటి ఖాళీ స్థలంలో ఉన్న సుమారు 1200 టన్నులు (300 ట్రాక్టర్లు) ఇసుక స్వాధీనం చేసుకున్నారు. అలాగే రామిరెడ్డిపల్లె మోటు, బాబాఫకృద్దీన్‌, ఇటుకల ఫ్యాక్టరీలో 150 టన్నుల ఇసుక, పొన ్నతోట గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తి స్థలం నుంచి 250 టన్నుల ఇసుక, పెద్దపసుపుల రోడ్డులోని నారాయణరెడ్డి, చిన్నపుల్లారెడ్డి, గురుస్వామి, నాగప్పలకు చెందిన ఇటుకల ఫ్యాక్టరీల్లో 1050 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ స్వాతి, డీఎస్పీ నాగరాజు, ఎక్సైజ్‌ సీఐ చెన్నారెడ్డి, అర్బన్‌ సీఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐలు రంగారావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


అక్రమార్కులపై కేసులు తప్పవు : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా సమాచారం వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. బుధవారం సాయంత్రం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-06-04T10:24:20+05:30 IST