ప్రాణాలు తీస్తున్న ఇసుక తవ్వకాలు

ABN , First Publish Date - 2020-09-23T05:49:09+05:30 IST

వాగులు, వంకల్లో చేపడుతున్న ఇసుక తవ్వకాల మూలంగా మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు

ప్రాణాలు తీస్తున్న ఇసుక తవ్వకాలు

నిలువెత్తు లోతువరకు తోడుతూ రవాణా

బొందల గడ్డలుగా మారుతున్న వాగులు

నీటి గుంతల్లో పడి ముగ్గురి దుర్మరణం

అనుమతుల్లేకున్నా యథేచ్ఛగా తరలింపు


మంచిర్యాల, సెప్టెంబరు 22: వాగులు, వంకల్లో చేపడుతున్న ఇసుక తవ్వకాల మూలంగా  మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా 10 ఫీట్ల లోతు వరకు చేపడుతున్న తవ్వకాలతో వాగులు బొందల గడ్డలుగా మారుతున్నా యి. ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి కారణంగా వాల్టా చట్టానికి తూట్లు పడుతుండగా, ఆ గుంతల్లో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని వాగు ల నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా అవుతుండగా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుక తవ్వకాలకు అనుమతుల్లేని వాగుల నుంచి కూడా పెద్ద మొత్తంలో అక్రమంగా ఇసుకను తరలి స్తున్నా అడిగేవారు కరువయ్యారు. జిల్లాలోని నెన్నెల మండలం ఖర్జీ వాగు, చెన్నూరులోని బతుకమ్మ వాగు మినహా ఇతర ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఇసుక తవ్వకాలకు అనుమతుల్లేవు. అయినా వివిధ మండ లాల్లోని వాగుల నుంచి నిత్యం పెద్ద మొత్తంలో ఇసు క తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. జిల్లా కేం ద్రంలోని రాళ్లవాగు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. 


మృత్యుకుహరాలుగా గుంతలు ....

ఇసుకాసురుల ధనదాహం మూలంగా గుంతల్లో పడి మనుషులు దుర్మరణం పాలవుతున్నారు. ఇసుక రవాణా కోసం తవ్వుతున్న గుంతలను అలాగే వదిలే స్తుండటంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాకాలంలో వానలు కురిసినప్పుడు ఆ గుంతల్లో నీరుచేరి మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. చేపలు పట్టడం, ఈతకు వెళ్లిన సందర్భాల్లో వాగుల్లో పడి మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. వాగుల వద్దకు వెళ్లిన సందర్భంలో నీటి ప్రవాహంలో గుంతలు ఏర్పడక వాటిలో పడి దుర్మరణం పాల వుతున్నారు. ఈ నెల 19న దండేపల్లి మండలం గూడెం సమీపంలోని కన్నెపెల్లి వాగులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన పదో తరగతి విద్యార్థిని కాలు జారి వాగులోపడి మృతి చెందింది. గతంలో ఈ వాగు లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం మే నెల 16న కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామంలోని పెద్ద ఒర్రెలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు.  ఈ వాగులో సైతం వేసవి కాలంలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగాయి. రెండు సంఘటనలకు కారణం గా ఆయా వాగుల్లో జరిపిన ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడ్డ గుంతలే అని ప్రజలు భావిస్తున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు....

నదులు, వాగుల్లో ఇసుక తవ్వకాలు గరిష్టంగా ఒక మీటరు లోతుకు మించి చేపట్టరాదని వాల్టా చట్టం చెబుతోంది. వాల్టా చట్టం ప్రకారం నదులు, వాగుల్లో 3 మీటర్ల లోతు వరకు ఇసుక నిల్వలు ఉన్న పక్షంలో అక్కడ ఒక మీటర్‌ లోతు వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. 6 మీటర్లకు పైగా నిల్వలు ఉన్నచోట కేవ లం 2 మీటర్ల వరకు తవ్వకాలు జరపాలి. అయితే నదుల్లో మినహా 3 మీటర్లకు పైగా ఇసుక నిల్వలు వాగుల్లో సాధారణంగా ఉండవు. ఇసుకాసురులు  రెండు, మూడు మీటర్ల లోతు వరకు వాగుల్లో తవ్వ కాలు చేపడుతూ వాటిని బొందల గడ్డలుగా మారు స్తున్నారు. ప్రభుత్వ పరంగా అనుమతులు ఉన్నచోట కూడా నిబంధనలకు విరుద్ధంగా అత్యంత లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


తనిఖీలు చేస్తున్నాం...మైనింగ్‌శాఖ ఏడీ రమావత్‌ బాలు 

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై తరుచుగా తనిఖీలు చేస్తున్నాం. దాడుల్లో పట్టుబడ్డ వాహనాలకు భారీ మొత్తంలో జరిమానా విధించడంతోపాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నాం. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అక్రమంగా ఇసుక రవాణాకు పాల్ప డుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లు 190 వాహనాలను సీజ్‌ చేశాం. ఆయా వాహనాల యజమానులకు రూ. 12 లక్షల జరిమానా విధించాం. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. 

Updated Date - 2020-09-23T05:49:09+05:30 IST