ఇసుకను బ్లాక్‌ చేస్తున్నారు

ABN , First Publish Date - 2020-06-06T08:20:54+05:30 IST

రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుకను ఎక్కడికక్కడ బ్లాక్‌ చేయడంతో తీవ్ర కొరత

ఇసుకను బ్లాక్‌ చేస్తున్నారు

వైసీపీ నేతలపై మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణలు

జిల్లాలో అవినీతిపై కలెక్టర్‌కు లేఖ రాసినా స్పందన లేదు


విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుకను ఎక్కడికక్కడ బ్లాక్‌ చేయడంతో తీవ్ర కొరత ఏర్పడిందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపిం చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వీడియో విడుదల చేశారు. గోదా వరి నది నుంచి రోజుకు 2,500 లారీల ఇసుక తరలిస్తుంటే...600 మాత్రమే లెక్కల్లో చూపిస్తు న్నారని ధ్వజమెత్తారు. మిగి లిన లారీలను వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయ కులు బ్లాక్‌ చేసి పొరుగు రాష్ట్రాలకు పంపు తున్నారన్నారు.


మద్యం లేకుండా చేస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు వాటి రేట్లు అమాంతంగా పెంచేసి ప్రజల్ని దోపిడీ చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి పథకంలో అర్హు లైన కుటుంబానికి ఒక చేతితో రూ.15 వేలు ఇచ్చి... మరో చేతిలో మద్యం రేటు పెంచేసి అంతకు మించి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు భూముల సేకరణ పేరిట రైతులతో బలవంతంగా సంతకాలు చేయించుకుని విలువైన భూమికి రూ.45 లక్షలు చెల్లించి మిగిలిన మొత్తం అధికారులు, అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వలంటీర్‌ వ్యవస్థ అవినీతిమయమయిందన్నారు. 


జిల్లాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాసినా ఆయన నుంచి స్పందన లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజ కీయ నాయకులు రాసిన లేఖలకు స్పందించి తగు సమాధానం ఇవ్వడం సంప్రదాయమన్నారు. ప్రభుత్వా నికో, జిల్లాలో అధికార పార్టీ నేతలకు భయపడి స్పందించకపోవడం దారుణమన్నారు. నాయకులకు భయపడి కంటే సెలవుపెట్టి వెళ్లిపోవాలని సూచించారు.

Updated Date - 2020-06-06T08:20:54+05:30 IST