అయినా అదేతీరు

ABN , First Publish Date - 2021-06-24T06:30:18+05:30 IST

ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా సామాన్యుడికి ఇసుక.. కంట్లో నలుసుగానే మారింది.

అయినా అదేతీరు

జేపీ కాంట్రాక్టు సంస్థకు అప్పగించినా తీరని ఇసుక కష్టాలు

డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో ధరపై బోటు యజమానుల వివాదం

15 రోజులకు పైగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం

స్థానిక లారీలకే ప్రాధాన్యం.. పలువురు యజమానుల అభ్యంతరం

ర్యాంపుల ముంగిట లారీలు.. రెండు రోజులకోసారి లోడింగ్‌

అధికారులు ఒక్కసారి దృష్టి పెడితే సమస్యలన్నీ పరిష్కారం


– పాలకొల్లు/కొవ్వూరు 

ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా సామాన్యుడికి ఇసుక.. కంట్లో నలుసుగానే మారింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వైసీపీ పాలకులు ఇప్పటికీ ఇసుక సరఫరాను గాడిలో పెట్టలేకపోయారు. ప్రజలకు కావాల్సినంత ఇసుకను.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందించలేక పోయారు. ఇది ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ప్రతిపక్షాల నుంచి ప్రజల వరకు దుమ్మెత్తిపోస్తున్నా తీరు మారడం లేదు. నిర్మాణదారులకు కష్టాలు తప్పడం లేదు. వరుస వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అధికారులు తక్షణం పరిష్కరించి ప్రజలకు అవసరమైన ఇసుక నిర్ణీత ధరకు లభ్యమయ్యేలా చూడాల్సి ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం మే 14 నుంచి ఇసుక ర్యాంపులను జేపీ పవర్స్‌ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. జిల్లావ్యాప్తంగా 56 ఇసుక ర్యాంపులలో కేవలం పది ఓపెన్‌ ర్యాంపులు మాత్రమే నడుస్తున్నాయి. 29 డీసిల్టేషన్‌ ర్యాంపులలో 19 ర్యాంపులు మాత్రమే తెరిచారు. కాంట్రాక్టు సంస్థ టన్ను ఇసుకకు రూ.675 వసూలు చేయడంపై బోట్స్‌మెన్‌ సొసైటీ నాయకులు సమ్మె చేపట్టడంతో డీసిల్టేషన్‌ ర్యాంపులు మూతపడ్డాయి. ర్యాంపులలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని 15 రోజుల తరువాత సొసైటీ నాయకులు మంగళవారం ఇసుక ర్యాంపులను మరోసారి తెరిచారు. కొద్దిసేపటికే కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ర్యాంపులను మూసివేసి వెళ్లిపోవడంతో మరోసారి ర్యాంపులు మూతపడ్డాయి. మరికొన్ని రోజులు ర్యాంపులు మూతపడితే ఇసుక కొరత తీవ్రమవుతుంది. అధికార యంత్రాంగం, కాంట్రాక్టు సంస్థ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వేలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికారులు ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలి. 

కొవ్వూరు సమీపంలోని బల్లిపాడు, చిడిపి, పం దలపర్రు, పెండ్యాల, జీడిగుంట, తీపర్రు, ఖండవ ల్లి, సిద్ధాంతం, నడిపూడి ర్యాంపులలో ఇసుక సేక రణకు శ్రీకారం చుట్టినప్పటికీ ఇప్పుడు డీసిల్టేషన్‌ కార్మికుల వివాదంతో పడవల ద్వారా ఎగుమతి చేసే ఇసుక సరఫరా నిలిచిపోయింది. వర్షాకాలం వినియోగానికి అనువుగా యార్డులకు తరలిస్తు న్నారు. పెద్ద ర్యాంపులైన సిద్ధాంతం, నడిపూడి లలో సాంకేతిక ఇబ్బందులు కారణంగా ఇసుక సరఫరా ఆగిపోయింది. ఆచంట కోడేరు ర్యాంపు లో బాటలు వేసినప్పటికీ తవ్వకాలు ప్రారంభిం చలేదు. వీటన్నింటిని వీలైనంత తర్వగా ప్రారంభించాలి.    గోదావరి ఎగువ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరద పొటెత్తుతోంది. ఇది పెరిగితే ఓపెన్‌ ర్యాంపులు మునిగి ఇసుక సరఫరా మూడు నెలలపాటు నిలిచిపోతాయి. ఈలోపే ఇసుక సరఫరాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చాలి. లేకుంటే మళ్లీ కొరత తలెత్తి ప్రభుత్వం అభాసుపాలవుతుంది.


అధికారులు చేతులెత్తేశారా ?

ఇసుక అమ్మకం బాధ్యతలు ప్రైవేటుకు అప్ప గించేశారంటూ సంబంధిత అధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో సరఫరా ఇష్టానుసా రంగా మారింది. గతంలో ఇసుక ర్యాంపులలో చూసీ చూడనట్లు ఎగుమతి చేయడం ద్వారా ఇసుక పక్కదారి పట్టేది. ఇప్పుడు ధర మరింత పెరిగినా తక్కువ ఇసుక రావడంతో వినియోగ దారులు గగ్గోలు పెడుతున్నారు. ఐదు యూనిట్ల ఇసుక అని చెబుతున్నప్పటికీ 4.5 యూనిట్లే వస్తోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై దృష్టి సారించాలి. 


 ఇబ్బందులు పెరిగాయి

ఇసుక విక్రయాలు ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఇబ్బందులు తొలగుతాయని ఆశించాం. కానీ మరింత పెరిగాయి. ర్యాంపులలో స్థానిక లారీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకల్‌ లారీలు, రోజుకు 2, 3 ట్రిప్పులు కిరాయి వేస్తే, ఇతర ప్రాంత లారీలకు రెండు రోజులకు ఒక లారీ ఇసుక మాత్రమే వస్తోంది. రెండు రోజులకు ఒక కిరాయి ద్వారా డ్రైవర్‌, క్లీనర్‌ జీతాలు, డీజిల్‌ ఇతర ఖర్చులకు సరిపోవడం లేదు. ర్యాంపులలో అన్ని ప్రాంత లారీలకు ప్రాధాన్యత కల్పించాలి. ఇసుక ఎగుమతి సమయం పెంచాలి. 

రావూరి రాజా, లారీ ట్రాన్స్‌పోర్టు, పాలకొల్లు



లోకల్‌.. నాన్‌ లోకల్‌ వివాదం

జిల్లాలో ఎగుమతులు అధికంగా అవుతున్న ర్యాంపులలో స్థానిక లారీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు మిగిలిన లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే లారీలు రోజుకు రెండు, మూడు ట్రిప్పులు ఇసుక సరఫరా చేస్తుంటే ఇతర ప్రాంతాల లారీలకు రెండు రోజులకు ఒక లారీ చొప్పున ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ డ్రైవర్‌, క్లీనర్‌ జీతాలు, ఖర్చులు, ఆయిల్‌ ఖర్చులు లెక్కిస్తే చేతి డబ్బులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నా రు. దీనిని భర్తీ చేసుకునేందుకు వెయిటింగ్‌ చార్జీ కింద వసూలు చేయక తప్పడం లేదని ఓ లారీ యజమాని చెప్పుకొచ్చారు. మరోవైపు డీజిల్‌ ధర లీటరు రూ.98కు చేరడంతో ఖర్చులు అధికమయ్యాయని ఆయన వాపోయారు. జిల్లాలో సుమారు రెండు వేల వరకు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయి. రోజుకు 500 లారీల వరకు ఎగుమతులు చేస్తుంటే.. మరో వెయ్యి వరకు లారీలు ఇసుక ర్యాంపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. నాలుగున్నర యూనిట్ల ఇసుక ధర జిల్లాలోని ఆయా ప్రాంతాలను బట్టి రూ.25–30 వేలు మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలి. 





సమీప ర్యాంపుల నుంచి ఐదు యూనిట్ల ఇసుక ధర..

          వసూలు చేయాల్సింది      వసూలు చేస్తోంది 

పాలకొల్లు 16,213 20,000

నరసాపురం 17,113 23,000

భీమవరం 18,900 25,000

ఏలూరు 19,800 26,000

టీపీగూడెం 15,213 20,000

జంగారెడ్డిగూడెం 15,213 19,000

డీజిల్‌ రూ.67 (పాతధర) ప్రస్తుతం రూ. 98


Updated Date - 2021-06-24T06:30:18+05:30 IST