ఆగమేఘాలపై అనుమతులు.. అక్రమాలు ఒక్కొక్కటిగా...

ABN , First Publish Date - 2020-10-30T00:31:55+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమాలు ఒక్కొక్కటిగా వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి పేరిట దరఖాస్తు చేసి అనుమతులు పొంది ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈపూరులో...

ఆగమేఘాలపై అనుమతులు.. అక్రమాలు ఒక్కొక్కటిగా...

గుంటూరు: జిల్లాలో ఇసుక అక్రమాలు ఒక్కొక్కటిగా వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి పేరిట దరఖాస్తు చేసి అనుమతులు పొంది ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈపూరులో ఇసుక తవ్వకాలకు అనుమతి కోరుతూ గనులు, భూగర్భ శాఖకు విశాఖకు చెందిన వీహెచ్‌పీ ఇన్‌ఫ్రా కంపెనీ ఈ ఏడాది జనవరి 24న దరఖాస్తు చేసుకుంది. మొత్తం 9 మందిని పట్టాదారులుగా పేర్కొంటూ వారి తరపున ఇసుక తవ్వకాలకు అనుమతి కోరారు. దీనిపై ఆగమేఘాలపై స్పందించిన వివిధ శాఖల సంయుక్త తనిఖీ అధికారుల బృందం ఫిబ్రవరి 28న అనుమతులు మంజూరు చేసి ఈ టీమ్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. వీరందరూ కలిసి కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రక్రియను పూర్తి చేసిన తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉండటంతో ఇంత వేగంగా ఫైలు పరుగులు తీసిందన్న వాదన వినిపించింది. 

Updated Date - 2020-10-30T00:31:55+05:30 IST