పెరిగిన ఇసుక ధర

ABN , First Publish Date - 2021-05-18T06:48:58+05:30 IST

ఇసుక ధర పెరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అవసరమున్న వారికి చుక్కలు కన్పిస్తున్నాయి.రోజుకో పాలసీ మారుస్తూ.. నెలకో ధరను నిర్ణయిస్తూ సామాన్యులను ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారు.

పెరిగిన ఇసుక ధర

రూ.375 నుంచి రూ.475కు ఎగబాకిన టన్ను ధర 


చంద్రగిరిలో అత్యధికంగా ట్రాక్టర్‌ ఇసుక రూ.3664


పుంగనూరు, జీడీనెల్లూరుల్లో తక్కువగా రూ.2036


చిత్తూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇసుక ధర పెరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అవసరమున్న వారికి చుక్కలు కన్పిస్తున్నాయి.రోజుకో పాలసీ మారుస్తూ.. నెలకో ధరను నిర్ణయిస్తూ సామాన్యులను ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా టన్ను ఇసుక ధరను వంద రూపాయల దాకా ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.375గా ఉన్న టన్ను ఇసుక రూ.475కు పెరిగింది. అంతేకాకుండా ఇసుక రీచ్‌ల నిర్వహణ, అవసరమున్నవారికి ఇసుక అందించే బాధ్యతను ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టింది.జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 14 రీచ్‌లను జేపీ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ వేలం పాటలో దక్కించుకుంది.సోమవారం సాయంత్రం చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో డీఆర్వో మురళి, మైన్స్‌ ఏడీ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌ల ఏర్పాటు, ధరల నిర్ణయం వంటి ఆంశాలపై చర్చించారు. ఓ ట్రాక్టరులో నాలుగు, మినీ టిప్పర్‌లో పది, పెద్ద టిప్పర్‌లో 20 టన్నుల ఇసుక పడుతుంది. రవాణా ఛార్జీలతో కలిపి చంద్రగిరిలో ఇక నుంచి ట్రాక్టర్‌ ఇసుక రూ.3664కు అందనుంది. ఇక్కడికి నాగలాపురం రీచ్‌ నుంచి ఇసుక తీసుకురావాలి. ఎక్కువ కిలోమీటర్లు ఉండడంతో రవాణా ఛార్జీ పెరిగింది. అలాగే పుంగనూరు, జీడీనెల్లూరు నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్‌ ఇసుక రూ.2036కు అందుబాటులోకి రానుంది. ఆయా ప్రాంతాలకు దగ్గరగా ఇసుక రీచ్‌లు ఉండడంతో రవాణా చార్జీ తక్కువగా ఉంది.ప్రతి నియోజకవర్గానికి కూడా ఓ ఇసుక రీచ్‌ను కేటాయించారు.


నియోజకవర్గం ఇసుకరీచ్‌ పేరు రీచ్‌ వద్ద దూరం రవాణాచార్జీ       నియోజకవర్గ కేంద్రం

టన్ను ధర             (కి.మీ) టన్నుకు           వద్ద టన్ను ధర

(రూపాయల్లో) (రూపాయల్లో)

తంబళ్లపల్లె పెద్దతిప్పసముద్రం 1,2 475 40 196 671

పీలేరు చీకటిపల్లె 475 25 123 598

మదనపల్లె చీకటిపల్లె 475 40 196 671

పుంగనూరు లద్దిగం 475 7 34 509

చంద్రగిరి నాగలాపురం క్లస్టర్‌ 475 90 441 916

తిరుపతి నాగలాపురం క్లస్టర్‌ 475 80 392 867

శ్రీకాళహస్తి తహ నగర్‌-1 475 25 123 598

సత్యవేడు నాగలాపురం క్లస్టర్‌ 475 25 123 598

నగరి నాగలాపురం క్లస్టర్‌ 475 40 196 671

జీడీనెల్లూరు నంగనూరు 475 7 34 509

చిత్తూరు ముత్తుకూరు 475 16 78 553

పూతలపట్టు నందనూరు 475 18 88 563

పలమనేరు శంకరాయలపేట 475 23 113 588

కుప్పం శంకరాయలపేట 475 87 426 901


త్వరలో అందుబాటులోకి అన్ని రీచ్‌లు: మురళి, డీఆర్వో, చిత్తూరు


ఇప్పటికే 14వ తేదీ నుంచి నాగలాపురం మండలంలోని నందనం, ఎస్‌ఎస్‌బీపేట రీచ్‌లను ప్రారంభించాం. 19వ తేదీ నుంచి చిత్తూరు మండలంలోని ముత్తుకూరు, ఆనగల్లు రీచ్‌లు ప్రారంభిస్తున్నాం. త్వరలో మిగిలిన రీచ్‌లు కూడా ప్రారంభిస్తాం.


 ప్రైవేటు కంపెనీ ద్వారా ఇసుక: అశోక్‌కుమార్‌, మైన్స్‌ ఏడీ, చిత్తూరు


ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లాలోని రీచ్‌లను జేపీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికి అప్పగించాం. మొత్తం 14 ఇసుక రీచ్‌లలో 11 ఓపెన్‌ రీచ్‌లు కాగా.. మూడు డీసిలే్ట్రషన్‌ రీచ్‌లుగా ఉన్నాయి.

Updated Date - 2021-05-18T06:48:58+05:30 IST