Abn logo
Nov 26 2020 @ 16:02PM

రూటు మార్చిన సందీప్

`వంగ‌వీటి`, `జార్జి రెడ్డి` లాంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న యువ న‌టుడు సందీప్ మాధ‌వ్‌ రూటు మార్చాడు. ఈసారి ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


హ‌ల్సియ‌న్ మూవీ ప‌తాకంపై సినిమాటోగ్రాఫ‌ర్ అరుణ్ కుమార్ సూర‌ప‌నేని నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. మ‌ధుకిర‌ణ్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర‌ నిర్మాత తెలియచేశారు.

Advertisement
Advertisement
Advertisement