టీడీపీ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి

ABN , First Publish Date - 2020-08-10T10:31:46+05:30 IST

కొండకోనల్లో ఉన్న గిరిజన గర్భిణుల కోసం వసతి గృహా లను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ గుమ్మిడి ..

టీడీపీ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి

ఎమ్మెల్సీ  సంధ్యారాణి 


 సాలూరు, ఆగస్టు 9: కొండకోనల్లో ఉన్న గిరిజన గర్భిణుల  కోసం వసతి గృహా లను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్ర పంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ మె శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఫోన్‌లో మాట్లాడుతూ,  ప్రపంచానికి నాగరికత నేర్పింది గిరిజ నులేనని అన్నారు.


కానీ, ప్రస్తుతం ఆధునిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇంకా కట్టుకోవటానికి దుస్తులు లేని దయనీయ పరిస్థితుల్లో గిరిజనులు ఉ న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగుదేశం ప్రభు త్వం గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవే శపెట్టిందన్నారు. జీవో నెంబర్‌ 257, జీవో నెంబర్‌ 3 అమలు, ఆశ్రమ గురుకుల పాఠశాలలు, రూ. 2 కిలో బియ్యం, చంద్రన్నబీమా, గృహ నిర్మాణ పథకం, ఫీడర్‌ అంబులెన్స్‌లు, డయాలసిస్‌ కేంద్రాలు, పోడు భూ ములపై హక్కు పత్రాలు,  రోడ్లు, కాలువలు,  ఉచిత కరెంట్‌, గిరి నెట్‌ కేంద్రాలు ఇలా ఎన్నో పథకాలు గిరిజనులకు చంద్రబాబు  అమలు చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారిని అసలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. 


వైసీపీ పాలనలో అన్యాయం: భంజ్‌దేవ్‌

సాలూరు, ఆగస్టు 9:  గత టీడీపీ హయాంలో అ మలుచేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసి వైసీపీ ప్రభు త్వం గిరిజనులకు అన్యాయం చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మె ల్యే ఆర్పీ. భంజ్‌దేవ్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినో త్సవం సందర్భంగా ఆదివారం గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  విలేకర్లతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో అరకు పార్లమెంట్‌ నియో జకవర్గ పరిధిలో  ఏడు నియోజకవర్గాలలో ఉ న్న ఆదివాసులకు గత టీడీపీ  ప్రభుత్వం  ఎన్నో సం క్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు.


50 ఏళ్లు దాటిన ఆదివాసులకు వృద్ధాప్య పింఛన్లు అందిం చా రని అన్నారు. గిరిపుత్రిక కళ్యాణ పథకం ద్వారా గిరి జన యువతులకు వివాహ కానుకలు అందిం చారని అన్నారు. గిరి గొరుముద్దలు, అన్నా అమృత హస్తం పథకాల ద్వారా పోషకాహారం బాలింతలకు శిశువు లకు అందించినట్లు చెప్పారు. రిలయన్స్‌తో ఒప్పందం చేసుకొని ఆదివాసీ ప్రాంతాల్లో కొత్తగా 32 జియో సెల్‌ టవర్లను ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఆది వాసీ ప్రాంతాలకు అందించారన్నారు. గిరిజన ప్రాం తాలను శత శాతం గిరిజనులకే రిజర్వు చేయటం జరిగిందని అన్నారు. 

Updated Date - 2020-08-10T10:31:46+05:30 IST