ఎస్‌ఎస్‌ ట్యాంకులో.. సౌర విద్యుత్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-05-12T06:15:26+05:30 IST

నీటిపై తేలే సౌర విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నగరపాలకసంస్థ అడుగు లు వేస్తోన్నది.

ఎస్‌ఎస్‌ ట్యాంకులో.. సౌర విద్యుత్‌ కేంద్రం
సంగం జాగర్లమూడిలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు

సంగం జాగర్లమూడి ఎస్‌ఎస్‌ ట్యాంకులో ఏర్పాటు

నీటి మీద తేలే 500 కిలో వాట్‌ సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణం

యూఎన్‌ఐడీవో సహకారంతో పైలట్‌ ప్రాజెక్టు

డీపీఆర్‌ రూపకల్పనకు రూ.17.453 కోట్ల మంజూరు

గుంటూరు, మే 11 (ఆంధ్రజ్యోతి): నీటిపై తేలే సౌర విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నగరపాలకసంస్థ అడుగు లు వేస్తోన్నది. యూనైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవల ప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(యూఎన్‌ఐడీవో) సహకారంతో 500 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌ని సంగం జాగర్లమూడిలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో ఏర్పాటు చేయనున్నారు. ఇందు కు సంబంఽధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.17.453 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇటీవలే నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. నగరంలో 159.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్నది. మొత్తం 57 ఎలక్షన్‌ వార్డులు, 22 శానిటే ష న్‌ డివిజన్‌లు ఉన్నాయి. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వ హించేందుకు మొత్తం 700 సూక్ష్మ పాకెట్లు ఏర్పాటు చేశారు. నిత్యం 420 మెట్రిక్‌ టన్నుల నుంచి 500 మెట్రికల్‌ టన్నుల వరకు సాలిడ్‌ వేస్టు ఉత్పత్తి అవుతున్నది. ఈ చెత్త నాయుడుపే టలోని డంపింగ్‌ యార్డుకు వయా ఏటుకూరు ట్రాన్సిట్‌ పాయింట్‌ నుంచి తరలిస్తున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద యూనిడో సుస్థిర నగరాల సమగ్ర పైలట్‌ అప్రోచ్‌ ఇండియా ప్రోగ్రాంని చేపట్టింది. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఎమిషన్స్‌ సంబం ధిత ప్రాజెక్టులని చేపడుతోన్నది. ప్రపంచ బ్యాంకు ద్వారా ఆయా ప్రాజెక్టులకు ఆర్థిక, సాంకేతిక సహ కారాన్ని అందిస్తోన్నారు. దేశ వ్యాప్తంగా జైపూర్‌, మైసూ ర్‌, బోపాల్‌, విజయవాడ, గుంటూరు నగరాలను ఎంపిక చేశారు. ఈ ఐదు నగరాల్లో కెపాసిటీ బిల్డింగ్‌ ప్రాజెక్టులు చేపట్టాల్సిందిగా సూచించారు. ఈ ప్రాజెక్టు కోసం యూనిడో రూ.10 కోట్లు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌గా మంజూ రు చేయనుంది. మిగతా రూ.7.453 కోట్లని జనరల్‌ ఫండ్స్‌ నుంచి కేటాయించేందుకు అనుమతి కోరుతూ కమిషనర్‌ లేఖ రాశారు. 

ఎలక్ట్రికల్‌ వాహనాల కొను గోలుకు సంబంధించి డీపీఆర్‌ ఖర్చు రూ.12.706 కోట్లుగా అంచనా వేశారు. అలానే 500 కిలోవాట్‌ నీటిపై తేలే సౌర విద్యుత్‌ ప్లాంట్‌ డీపీఆర్‌ ఖర్చు రూ. 4.747 కోట్లుగా ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనలను పరి శీలించిన ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే ప్రతి పాదించిన పేలోడ్‌ కెపాసిటీని పెంచాలని, అలానే ఎలక్ట్రిక్‌, హైడ్రాలిక్‌ లిఫ్టర్‌ని మార్చాలని సూచించింది. నాన్‌ హైడ్రాలిక్‌ సిస్టమ్‌కి 1.2 కిలో వాట్‌ మోటార్‌ పవర్‌ బదులు 2.4 కిలో వాట్‌ని పరి శీలించాలని ఆదేశించిం ది. డీపీఆర్‌ రూపకల్పన లో తగిన చర్యలు చేపట్టాల్సిం దిగా నగర పాలక సం స్థ కమిషన ర్‌ని మునిసి పల్‌ పరిపాల న శాఖ స్పెష ల్‌ చీఫ్‌ సెక్రెటరీ వై శ్రీలక్ష్మి ఆదేశించారు. 


Updated Date - 2021-05-12T06:15:26+05:30 IST